Begin typing your search above and press return to search.

ఆ ఫీలింగ్‌ చూపడంలో మెగా ఫ్యామిలీ కేక

By:  Tupaki Desk   |   31 May 2016 10:30 PM GMT
ఆ ఫీలింగ్‌ చూపడంలో మెగా ఫ్యామిలీ కేక
X
ఇప్పుడంటే మెగా-నందమూరి రైవల్రీ అని మాట్లాడుతున్నారు కాని.. అప్పట్లో అయితే మెగాస్టార్‌ అండ్‌ సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్ రైవల్రీ చాలా అధికంగా ఉండేది. ఎందుకంటే.. 80వ దశకంలో చిరంజీవి 'ఖైదీ' వంటి సినిమాలను చేస్తూ టాప్‌ రేంజ్‌ కు వచ్చేసరికి.. అప్పటికే అక్కడ నెం.1 స్థానంలో కూర్చుంది సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఆల్రెడీ ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్‌ హడావుడి కాస్త ఫేడైంది. అందుకే అప్పట్లో ధియేటర్స్ లో కృష్ణ వర్సెస్ చిరు అభిమానుల మధ్య ఒకలాంటి రచ్చలు జరుగుతూనే ఉండేవట.

కట్‌ చేస్తే.. అసలు ఇటువంటి రైవల్రీలతో సంబంధం లేకుండా.. స్వయంగా 'మెగా' ఫ్యామిలీ మెంబర్లే ఇతర హీరోల ఫ్యాన్లు. వారు దానిని ఓపెన్‌ గా ఎడ్మిట్‌ చేసేవారు కూడా. ఉదాహరణకు మెగాస్టార్‌ చిరంజీవి తల్లిగారైన అంజనమ్మ.. అక్కినేని అభిమాని. ఆవిడ ధియేటర్లలో కొడుకు చిరంజీవి సినిమాలు ఆడుతున్నా కూడా.. ముందు అక్కినేని సినిమాలను చూసి.. ఆ తరువాతే కొడుకు సినిమా చూసేవారట. అంత అభిమానం ఆవిడకు. స్వయంగా మెగాస్టార్ ఈ విషయం ఎన్నోసార్లు చెప్పారు. అదే విధంగా.. ఎంతో రైవల్‌ అనుకున్న బాలయ్య అంటే చరణ్‌ కు చాలా ఇష్టం. అప్పట్లో ఒక పిల్లాడు బాలయ్య డైలాగులు మీ ముందు చెప్పకూడదు అంటే.. దానిదేముంది.. నాక్కూడ బాలయ్య అంటే ఇష్టం.. డైలాగులు చెప్పు అన్నాడు చరణ్‌. ఆ తరువాత శ్రీమంతుడు సినిమా నచ్చిందని కూడా చరణ్‌ ఒక్కడే తనకు ఫోన్‌ చేసి విషెస్‌ చెప్పాడని స్వయంగా మహేష్‌ బాబే చెప్పాడు.

మొన్నామధ్యన.. మెగా ఫ్యామిలీ హీరోలు కాకుండా.. మీకు ఎవరంటే ఇష్టం అని వరుణ్‌ తేజ్‌ ను అడిగితే.. తడుంకోకుండా ప్రభాస్‌ పేరు చెప్పేశాడు. అలాగే ఇప్పుడు సాయిధరమ్ తేజ్‌ కూడా అంతే. గూడఛారి 116 అండ్‌ మోసగాళ్లకు మోసగాడు పోస్టర్ ను ట్వీట్‌ చేసి మరీ కృష్ణ కు అభినందనలు తెలియజేశాడు. ఒకప్పుడు ఉన్న మెగా-కృష్ణ రైవల్రీ గురించి తెలిసినవారు ఈ ట్వీట్లను చూసి కాస్త అవాక్కయ్యారు. ఏదేమైనా కూడా.. ఇతర హీరోలపట్ల ఉన్న అభిమానాన్ని చూపించడంలో మెగా హీరోల రూటే సెపరేటబ్బా!! కేక అంతే!!