మెగా కుర్రాళ్ళు ఆ విషయంలో ముందే

Thu Jan 12 2017 16:32:17 GMT+0530 (IST)

మామూలుగా చాలామంది హీరోలు మనం పలానా స్టార్ హీరోకు విషెస్ చెప్పొచ్చా లేదా అని ఆలోచిస్తుంటారు. కాని మెగా హీరోస్ మాత్రం.. అబ్బే మాకు అలాంటి పట్టింపులేవీ లేవు అన్నట్లుంటారు. బహుశా చిరంజీవి వీరికి నేర్పిన తత్వం అదే అనుకుంట. టాలీవుడ్ లోనే మెగా అండ్ నందమూరి క్యాంప్స్ అంటే రెండు రైవల్ క్యాంపులనే బిరుదు ఉంది. కాని మెగా హీరోలు మాత్రం వాటన్నింటినీ మాపేస్తున్నారు.ఈరోజు పొద్దున్నే నందమూరి బాలకృష్ణకు విషెస్ తెలిపాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. అలాగే అల్లు శిరీష్ కూడా మెగా60 ఈవెంట్లో బాలయ్యతో దిగిన ఫోటో ఒకటి పెట్టి.. విషెస్ తెలియజేశాడు. ఇద్దరూ కూడా ఈరోజు మార్నింగ్ వావ్ అనిపించేశారు. ఇక రెండు రోజుల ముందే బాలయ్య సినిమాకు తన విషెస్ ట్వీట్ చేశాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. అలాగే రామ్ చరణ్ కూడా విషెస్ చెప్పాశాడు. గతంలో ఓసారి రామ్ చరణ్ ఓ చిన్న కుర్రాడు బాలయ్య డైలాగులు నేను చెప్పకూడదు అన్నప్పుడు.. ఎవరు చెప్పొద్దన్నారు? బాలయ్య బాబు డైలాగులు చెప్పు.. అంటూ అడిగి మరీ చెప్పించుకున్నాడు. అలాగే చరణ్ మొన్న మహేష్ తో న్యూ ఇయర్ పార్టీ చేసుకున్న సంగతి తెలిసిందే.

మొత్తానికి ఇతర రైవల్ హీరోలందరితోనూ హెల్తీ వాతావరణం మెయిన్టయిన్ చేయడంలో.. మెగా కుర్రాళ్ళందరూ భలే డిఫరెంట్ అనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/