ఫోటో స్టొరీ: మెగాహీరోలందరూ ఒకే ఫ్రేమ్ లో!

Thu Nov 08 2018 11:47:44 GMT+0530 (IST)

మెగా ఫ్యామిలీ హీరోలందరినీ ఒకే చోట చూడడం అన్నది రేర్ గా జరుగుతుంది. ఇక వాళ్ళందరూ గ్రూప్ ఫోటో దిగితే  ఆ ఫోటోను చూసేందుకు రెండు కళ్ళూ చాలవు.  ఇక దీపావళి సందర్భంగా అరుదైన కలయిక చోటుచేసుకుంది.  మెగా కాంపౌండ్ లో జరిగిన దీపావళి అందరూ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.  అందులో చాలామంది సంప్రదాయ దుస్తులలో కన్పించడం విశేషం.ఒక ఫోటోలో మెగా హీరోలందరూ పోజిచ్చారు. చిరంజీవి.. నాగబాబు.. చరణ్.. బన్నీ.. వరుణ్.. సాయి ధరమ్ తేజ్.. అల్లు శిరీష్. కళ్యాణ్ దేవ్.. వైష్ణవ్ తేజ్.. అరవింద్ గారి పెద్ద కుమారుడు బాబీ అందరూ ఈ ఫ్రేమ్ లో ఉన్నారు.  ఇంతమంది గ్యాంగ్ తో గ్యాంగ్ లీడర్ చిరు ఉంటే హంగామా ఓ రేంజ్ లో ఉంటుందని మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు కదా?  ఈ ఫోటోలో మిస్ అయిన ఒకే హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయన తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్రతో బిజీగా ఉన్నా సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ఫ్యామిలీ తో స్నేహ పేరెంట్స్ కూడా దీపావళి సెలబ్రేషన్స్ కు జాయిన్ కావడం మరో విశేషం.  ఈ మొత్తం ఫోటోలు చూస్తే ఏం అర్థం అయింది?  దీపావళి ని చక్కగా జరుపుకోండని సభ్యసమాజానికి క్రాకర్స్ మెసేజ్ ఇచ్చారు.