హీరోయిన్ టెన్షన్ లో ఓ మెగా హీరో?

Mon Jul 17 2017 14:30:57 GMT+0530 (IST)

డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటాడని - టాక్ తెచ్చుకున్న ఓ మెగా కాంపౌండ్ హీరోకి పాపం ఫస్ట్ నుంచి కష్ట కాలం నడుస్తూనే ఉంది. కేవలం బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ తోనే ఇంతవరకు నెట్టుకువస్తున్న ఆ మెగా హీరోని వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయట. అయితే సరైన హీరోలు లేక చేసేదేమి లేక కొందరు బడా నిర్మాతలు ఆ హీరోగారితో సినిమాలు కమిట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆ హీరోగారి సినిమా రిలీజ్ కి రెడీ అయింది. అప్పుడే  ఆ సినిమాకి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు అయితే పబ్లిసిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ మెగా హీరో కంటే హీరోయిన్ పైనే ఎక్కవ ఫోకస్ పెడుతున్నారట ఆ సినిమా దర్శకనిర్మాతలు.

ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆ హీరోగారి కంటే అతని పక్కన నటించిన హీరోయిన్ కే ఎక్కువ ప్రాధన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుందని టాక్. ఇక ఫిల్మ్ సర్కిల్స్ మధ్య కూడా ఆ మెగా హీరో కంటే హీరోయిన్ కే ఎక్కువ క్రేజ్ ఉందనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ టాక్స్ హీరో వరకు చేరాయట. అయితే ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకి చెప్పలేక ఆ మెగా హీరో సైలెంట్ అయిపోయాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఆ మెగా హీరో టెన్షన్ ఏ రీతిన తీరుతుందో చూడాలి.