Begin typing your search above and press return to search.

బాహుబలి2.. మెగా ఫ్యాన్స్ సీరియస్

By:  Tupaki Desk   |   26 April 2017 9:44 AM GMT
బాహుబలి2.. మెగా ఫ్యాన్స్ సీరియస్
X
ఇప్పుడు బాహుబలి 2 సినిమా రిలీజ్ కోసం చాలామంది ఆత్రంగా ఎదురుచూస్తున్న వేళ.. అసలు బాహుబలి 2 సినిమాను చూడొద్దంటే చూడొద్దు అంటూ మెగా ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. మరి నిజమైన మెగా ఫ్యాన్స్ ఈ మెసేజ్ ను పంపారో లేక ఇది ఉత్తుత్తినే చేస్తున్న హడావుడో తెలియదు కాని.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మెసేజ్ వైరల్ అవుతుంది.

వాట్సాప్ లో తిరుగుతున్న ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే... ''నువ్వు మెగా ఫ్యామిలీ అభిమానివా? ఒక వారం వరకు బాహుబలి-2 చూడటం మాను. నువ్వు ఒక చిరు - పవన్ - అర్జున్ - చరణ్‌ - సాయిధరమ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానివి అయితే బాహుబలి థియేటర్ దరిదాపుల్లో కనిపించకు. చిరంజీవి గారి సినిమాకి బెనిఫిట్ షో కి పర్మిషన్ లేదు. అధికారంలోకి రావడానికి సహాయపడిన పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడి సినిమా బెనిఫిట్ షో కి పర్మిషన్ లేదు. ఎలాంటి మెసేజ్ ఓరియంట్ సినిమాలేని బుర్ర లేని వెదవలు కోసం తీసిన ఇంగ్లిషు సినిమాలు కాపి బాహుబలికి మాత్రం రోజుకి 6 షోలు వేసుకోవడాకి పెర్మిషన్ ఎలా ఇస్తారు? నువ్వు చూడటం మానేయ్. అప్పుడు చూడు వాళ్ళకి నాలుగో షో కూడా పడదు. నేను ఛాలెంజ్ చేస్తా... మరి నువ్వు??''

అయితే ఈ మెసేజ్ ను నిజంగా సీరియస్ గా తీసుకుని అభిమానులు సినిమాను చూడటం మానేస్తారా? నిజంగానే ఒక వర్గం బాహుబలి ఎక్స్ ట్రా షోలు వేయడంతో హర్టయ్యారా? గతంలో కృష్ణా జిల్లాలో ''దమ్ము'' సినిమా రిలీజ్ టైములో ఇదే విధంగా జూ.ఎన్టీఆర్ సినిమాను చూడొద్దని నందమూరి ఫ్యాన్స్ లో వర్గం మెసేజులు పంపడంతో.. ఆ సినిమాకు అక్కడ 1వ ఆట తరువాత ఓపెనింగ్స్ ఏమీ లేకుండా పోయాయ్. చూద్దాం ఏమవుతుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/