Begin typing your search above and press return to search.

బాస్ ఈజ్ బ్యాక్.. కాదని చెప్పినా వినరే

By:  Tupaki Desk   |   20 Oct 2016 9:30 AM GMT
బాస్ ఈజ్ బ్యాక్.. కాదని చెప్పినా వినరే
X
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మెగాస్టార్ డ్యాన్సును చూసి మురిసిపోయారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఆయన తన ట్వీట్లో. ''బాస్ ఈజ్ బ్యాక్ పాట షూటింగ్ పూర్తయ్యింది..'' అంటూ రాశారు. ఇప్పుడు అదే పెద్ద రచ్చకు తెరలేపింది. బాస్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ గతంలో బ్రూస్ లీ రిలీజ్ టైములో ట్రెండ్ చేయడం..ఆ సినిమా ఫ్లాపవ్వడం.. తదితర విషయాలను చూసి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఈ ట్యాగ్ అంటే భయపడుతున్నారు అంటూ సోషల్ మీడియాల్లో కామెంట్లు వస్తున్నాయి.

కొందరైతే ఇంకాస్త ముందుకు వెళ్ళి.. ''బాస్ ఈజ్ బ్యాక్' అనే పేరుతో పాట కనుక ఉంటే.. అసలు ధియేటర్లలోకి అభిమానులు తప్పించి ఎవ్వరూ అడుగుపెట్టరు'' అంటూ కామెంట్ చేయడం ఇంకా అనేక డిస్కషన్లకు కేంద్ర బింధువు అయ్యింది. అదేంటి.. నిజంగానే అభిమానులు అంత కఠోరంగా ఉంటారా? అసలు సినిమా లవర్స్ అందరూ అంత పట్టింపులు మధ్యన బ్రతుకుతారా? అబ్బే లేదు. ఎవరో కొందరు కామెంట్ చేస్తే అది అందరికీ ఆపాదించలేం. ఈ మధ్యనే 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాలో నాని బాలయ్య ఫ్యాన్ గా నటించాడు. అందుకని నాని ఫ్యాన్స్ సినిమాను చూడటం మానేశారా? బాలయ్య ఫ్యాన్స్ అందరూ నాని ఫ్యాన్స్ కాదు.. నాని ఫ్యాన్స్ అందరూ బాలయ్య ఫ్యాన్స్ కాదు. ఎవరో కొందరికే ఇద్దరూ నచ్చుంటారు. అయినా అందరూ నాని సినిమాను చూశారుగా. అలాగే బాలయ్య స్వయంగా తన 100వ సినిమా లాంచ్ కు చీఫ్‌ గెస్టుగా మెగాస్టార్ చిరంజీవిని పిలిచారు.. అందుకని నందమూరి ఫ్యాన్స్ మేము ఫంక్షన్లో ఉండము అన్నారా? అభిమానులు ఎప్పుడూ అలా చేయరండి. ఎవరో కొందరు అలాంటి కామెంట్లు చేస్తే.. అది చూసి అభిమానులు అందరూ అలాగే అనుకుంటున్నారని అనుకోవడానికి లేదులే.

అయినా 'బాస్ ఈజ్ బ్యాక్' అనేది పాట కాదు బాబోయ్ అంటూ మెగా ప్రొడక్షన్ హౌస్ కొణిదెల ప్రొడక్షన్స్ పి.ఆర్.ఓ.లు చెప్పినా కూడా మనోళ్లు వినట్లేదు. అయినా ఆ ట్యాగ్ అంటే ఫ్యాన్స్ కు భయం.. యాంటి ఫ్యాన్స్ కు ఇష్టం.. ఇలాంటివి ప్రచారం చేయడం వలన టాలీవుడ్ కూడా అజిత్ అండ్ విజయ్ ఫ్యాన్స్ తరహాలో తయారయ్యే ప్రమాదం ఉంది. సినిమాలో కంటెంట్ ఉంటేనే సినిమా ఆడుతుంది కాని.. ట్విట్టర్లో హ్యాష్‌ ట్యాగ్ వలన ఆడేయదు కదా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/