Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ మళ్ళీ హర్టయ్యారంటగా!!

By:  Tupaki Desk   |   26 Oct 2016 10:30 PM GMT
మెగా ఫ్యాన్స్ మళ్ళీ హర్టయ్యారంటగా!!
X
ఈ మధ్య కాలంలో మెగా ఫ్యాన్స్ చాలాసార్లు హర్టయిపోతున్నారు. ఇప్పటివరకు తమని హర్టు చేసిన వారిని మళ్లీ మెగా ఫ్యామిలీ చేరదీయడంతో ఈ అభిమానులకు మండిపోతోందట. ఒక్కసారి మెగా హీరోల పేరుతో ఈ అభిమానులు రన్ చేసే ఫేస్ బుక్ పేజీలను చూస్తే ఆ విషయం అర్దమైపోతుంది. మొన్నామధ్యన ఒక పి.ఆర్.ఓ. విషయంలో హర్టయిన అభిమానులు ఇప్పుడు ఒక ఐటెంగాళ్ విషయంలో హర్టయ్యారు.

ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవిని ''పొలిటకల్ బఫూన్'' అంటూ ట్విట్టర్ సాక్షిగా కామెంట్ చేసిన ఒక సినిమా జర్నలిస్టును వరుణ్‌ తేజ్ తన పి.ఆర్.ఓ గా పెట్టుకున్నాడనే న్యూస్ బయటకు రావడంతో.. వెంటనే మెగా ఫ్యాన్స్ చాలామంది సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేశారు. అప్పట్లో వరుణ్‌ తేజ్ సదరు పి.ఆర్.ఓ ను ఎవ్వరినీ పెట్టుకోలేదు అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఇప్పుడిక విషయం ఏంటంటే.. అప్పట్లో పవన్ కళ్యాణ్‌ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే ఏమొస్తుంది అంటూ సెక్సీ యాంకర్ అనసూయ కామెంట్ చేసింది. ఇప్పుడు అదే యాంకర్ తో సాయిధరమ్ తేజ్ తన ''విన్నర్''లో ఐటెం సాంగ్ చేయనున్నాడంటే.. ఫ్యాన్స్ మళ్లీ హర్టయిపోతున్నారు.

ఈ విషయంలో ఫ్యాన్స్ బాధను మెగా హీరోలు ఎంతవరకు పట్టించుకుంటారో తెలియదు కాని.. ఖచ్చితంగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసే పనులైతే చేయరు. అయితే ఒక విషయం ఏంటంటే.. మెగా హీరోలను క్రిటిసైజ్ చేసి మళ్ళీ వాళ్లతోనే ఈ 'కొందరు' పనిచేస్తున్నారంటే.. మెగా హీరోలకు ఎంత సాఫ్ట్ మనస్సు ఉందో చూడండి. ఆ విషయం ఫ్యాన్స్ కూడా తెలుసుకుంటే బెటరేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/