Begin typing your search above and press return to search.

వరుణ్‌ తేజ్‌ డెడికేషన్‌ కు మెగా ఫ్యాన్స్‌ ఫిదా

By:  Tupaki Desk   |   14 Jun 2019 7:09 AM GMT
వరుణ్‌ తేజ్‌ డెడికేషన్‌ కు మెగా ఫ్యాన్స్‌ ఫిదా
X
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు తాజాగా ప్రమాదంకు గురైన విషయం తెల్సిందే. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ అవ్వడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే వరుణ్‌ తేజ్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఎవరైనా యాక్సిడెంట్‌ కు గురైతే రెండు మూడు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. గాయాలు ఏమీ కాకున్నా కూడా టెన్షన్‌ ఫ్రీ అవ్వడం కోసం అన్ని పనులు వదిలేస్తారు. కాని వరుణ్‌ తేజ్‌ మాత్రం యాక్సిడెంట్‌ జరిగిన వెంటనే షూటింగ్‌ కు హాజరు అయ్యాడు. వరుణ్‌ తేజ్‌ షూటింగ్‌ లో పాల్గొన్నట్లుగా తెలియజేస్తూ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఒక ఫొటోను ట్వీట్‌ చేశాడు. యాక్సిడెంట్‌ అయినా కూడా వెంటనే వరుణ్‌ తేజ్‌ షూటింగ్‌ లో పాల్గొనడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'వాల్మీకి' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళ హిట్‌ మూవీ జిగర్తాండకు ఇది రీమేక్‌ అనే విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం యాగంటిలో జరుపుకుంటుంది. ఆ సినిమా షూటింగ్‌ కోసం వెళ్తున్న సమయంలోనే వరుణ్‌ కు యాక్సిడెంట్‌ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వరుణ్‌ తేజ్‌ డెడికేషన్‌ తో యాక్సిడెంట్‌ అయినా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించవద్దనే ఉద్దేశ్యంతో షూటింగ్‌ లో పాల్గొని అందరి మనసులు గెలుచుకున్నాడు.