ఈ మెగా ఫ్యాన్స్ కు మైండ్ ఉందా??

Thu Apr 20 2017 10:29:28 GMT+0530 (IST)

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు. ప్రస్తుతం వరుసగా విన్నర్.. మిష్టర్.. కాటమరాయుడు వంటి మెగా మూవీస్ అన్నీ ఫ్లాపైపోవడంతో.. వీళ్లందరూ కూడా బన్నీ డిజెతో..  రామ్ చరణ్ సుకుమార్ సినిమాతో ఎలాగైనా పెద్ద హిట్లు కొట్టాలని తహతహలాడుతున్నారు. అదంతా ఒకెత్తయితే ఇప్పుడు కొంతమంది అభిమానులు రామ్ చరణ్ సినిమా షూటింగు చూడాలని అనుకోవడం మరో ఎత్తు అయిపోయింది.

గత కొంతకాలంగా పోలవరం పరిసర ప్రాంతాల్లో సిరివాక గ్రామం దగ్గర జరుగుతున్న చెర్రీ-సుక్కు సినిమా షూటింగ్.. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని కొల్లేరు ప్రాంతానికి మారింది. మనోళ్లు గత రెండు మూడు రోజుల పాటు కొల్లేరు చుట్టుపక్కల షూటింగ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో రామ్ చరణ్ భీమవరంలోని వివిద ప్లేసులకు టూర్లు కొడుతున్నాడు. అయితే చరణ్ ఇలా కొల్లేరులో షూటింగ్ చేస్తున్నాడు.. భీమవరంలో హోటల్లో ఉంటున్నాడు.. అంటూ మెగా ఫ్యాన్స్ గ్రూప్స్ అన్నీ ఇప్పుడు అభిమానులకు మెసేజ్ పంపించేసి.. మీరు మాత్రం ఆ చుట్టుపక్కలకు వెళ్ళి రచ్చ చేయకండి ప్లీజ్ అంటూ లాస్టులో ఒక లైన్ యాడ్ చేశారు. చూస్తుంటే ఇది కామెడీగా లేదు?

అసలు చరణ్ ఎక్కడ ఉంటున్నాడో చెప్పేయడం దేనికి? ఆ తరువాత అక్కడికి వెళ్లొద్దు అనడం దేనికి? మైండ్ లేని పనులు గురూ. చక్కగా అతని హోటల్ లొకేషన్ సీక్రెట్ గా ఉంచితే.. ఎవ్వరూ వచ్చి రచ్చ చేయరు కదా. థింక్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/