Begin typing your search above and press return to search.

మెగా.. నందమూరి ఫ్యాన్స్ దిల్ ఖుష్!

By:  Tupaki Desk   |   12 Jan 2019 2:30 PM GMT
మెగా.. నందమూరి ఫ్యాన్స్ దిల్ ఖుష్!
X
స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే హీరోల కంటే డై హార్డ్ ఫ్యాన్స్ కు ఎక్కువ టెన్షన్ గా ఉంటుంది. ఎందుకంటే సినిమా బాగుంటే సరే.. అటూ ఇటూ అయితే యాంటి ఫ్యాన్స్ ఏకేస్తారు కాబట్టి. ఈమధ్య ఫ్యాన్స్ కు తమ అభిమానం మరింతగా ఎక్కువై అవతలి వర్గం హీరో సినిమా బాగున్నా.. బాగాలేకపోయినా ఏదో ఒక పాయింట్ ను దొరకబుచ్చుకొని ట్రోలింగ్ చేయడం మొదలు పెడుతున్నారు.

గతంలో మహేష్.. పవన్ ఫ్యాన్స్ మధ్య ఇలాంటి హంగామా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా సంక్రాంతి రిలీజుల్లో మెగా - నందమూరి ఫ్యాన్స్ మధ్య ఇదే సీన్ రిపీట్ అవుతోంది. సంక్రాంతి సీజన్లో మొదట 'ఎన్టీఆర్ కథానాయకుడు' రిలీజ్ అయింది. సినిమాకు బ్యాడ్ టాక్ అయితే రాలేదుకానీ కొందరు మెగా ఫ్యాన్స్ 'కథానాయకుడు' సినిమాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. బాలయ్య గెటప్ ను మాయావతి తో పోల్చడం లాంటి మీమ్స్ ఎన్నో తయారు చేసి నందమూరి ఫ్యాన్స్ ను గట్టిగా తగులుకున్నారు.

కట్ చేస్తే రెండు రోజులు గడిచాయి. చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' రిలీజ్ అయింది. దీంతో బోయపాటి క్రియేటివిటీ దెబ్బకు నందమూరి ఫ్యాన్స్ కు పెద్ద బ్రహ్మాస్త్రం దొరికింది. దీంతో ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ లో ఒక సెక్షన్ ఇప్పుడు ఈ సినిమాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టేసింది. తమ అభిమాన హీరో సినిమాను ట్రోలింగ్ చేసినందుకు ఇప్పుడు బదులు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఓవరాల్ గా చూస్తే తమ హీరో సినిమా ఫ్లాప్ అయినందుకు.. కలెక్షన్స్ తక్కువ ఉన్నందుకు దిగులు కంటే పోటీలో ఉన్న హీరో సినిమా బాల్చీ తన్నేసినందుకు దిల్ ఖుష్ గా ఉంది ఇరువర్గాల ఫ్యాన్స్ కు. ఫ్యాన్స్ కు తమ హీరో సినిమా ఫలితం విషయంలో నిరాశ.. యాంటి ఫ్యాన్స్ కు మాత్రం సంక్రాంతి పండగ లా ఉంది! ఇదంతా చూస్తుంటే తమిళ స్టార్ హీరోల ఫ్యాన్స్ పైత్యం మనవాళ్ళకు పూర్తిగా అంటుకున్నట్టుగా ఉందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.