Begin typing your search above and press return to search.

పొగిడిన నోటితోనే తిట్టించుకున్న వ‌ర్మ‌!

By:  Tupaki Desk   |   20 April 2018 8:34 AM GMT
పొగిడిన నోటితోనే తిట్టించుకున్న వ‌ర్మ‌!
X
ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అలా తిట్ట‌మ‌ని శ్రీ‌రెడ్డికి స‌ల‌హా ఇచ్చింది తానే అని వ‌ర్మ బాహాటంగా ప్ర‌క‌టించ‌డం....ఆ త‌ర్వాత చాలా సార్లు బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం తెలిసిందే. అయితే, అప్ప‌టికే వ‌ర్మకు భ‌ర్తీచేయ‌లేని డ్యామేజీ జ‌రిగిపోయింది. అప్ప‌టివ‌ర‌కు వ‌ర్మ‌పై కాస్తో కూస్తో గౌర‌వం ఉన్న వారు కూడా తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఇక ఎప్ప‌టినుంచో వ‌ర్మ‌పై గుర్రుగా ఉన్న‌ మెగా ఫ్యామిలీ....వ‌ర్మ‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతోంది. ఎపుడూ శాంతంగా ఉండే నిర్మాత అల్లు అర‌వింద్ కూడా ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వ‌ర్మ‌ను టార్గెట్ చేస్తున్నా అని పిచ్చ పిచ్చ‌గా తిట్టేశారు. వ‌ర్మ ...నీచుడు నికృష్టుడు అంటూ విరుచుకుప‌డ్డారు. అయితే, మెగా ఫ్యామిలీ నుంచి ఓ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు అప్ప‌ట్లో మండిప‌డ్డారు. ఆ త‌ర్వాత వ‌ర్మ‌పై మెగా కాంపౌండ్ నుంచి ఎవ‌రూ విమ‌ర్శ‌లు చేయ‌లేదు. ఇంకా చెప్పాలంటే , కొద్ది రోజుల క్రితం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో వ‌ర్మ ను అర‌వింద్ పొగిడారు కూడా.

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవికి వ‌ర్మ హార్డ్ కోర్ ఫ్యాన్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆమె హ‌ఠాన్మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని వ‌ర్మ ...ఆమెపై ఓ లేఖ రాశాడు. ఆ లేఖ ను చూసిన అరవింద్ ....వ‌ర్మ‌ను పొగిడారు. వర్మ గురించి అంతా ర‌క‌ర‌కాలుగా అనుకుంటార‌ని, కానీ, శ్రీదేవిపై అతడి ప్రేమను తెలుపుతూ ఈ లేఖ చ‌క్కగా రాశాడ‌ని శ్రీదేవి సంస్మరణ సభలో అర‌వింద్ ప్ర‌శంసించారు. దీంతో, మెగా కాంపౌండ్ కు వ‌ర్మ కు మ‌ధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుంద‌ని అంతా భావించారు. అయితే, ప‌వ‌న్ ను బూతులు తిట్టించ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. వర్మనే టార్గెట్ చేస్తున్నా అని బాహాటంగా ప్ర‌క‌టించి మ‌రీ అర‌వింద్ ఓ రేంజ్ లో వ‌ర్మ‌పై విరుచుకుప‌డ్డారు. దానికి తోడు...అర‌వింద్ వ్యాఖ్య‌ల‌కు వ‌ర్మ జ‌వాబిస్తూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో, మెగా ఫ్యామిలీకి వ‌ర్మ‌కు మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.