మెగాకోడలు అనిపించిందిగా!

Fri Nov 09 2018 15:25:29 GMT+0530 (IST)

ఈమధ్య మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ సెలబ్రేషన్ మూడ్ లో ఉంది.  ఇప్పటికే మెగా ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మరో సారి తల్లి కానుందన్న వార్త కూడా మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని తీసుకొచ్చింది.రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి జుబ్లీ హిల్స్ నివాసంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.  చిరంజీవి ఫ్యామిలీ అందరితో పాటుగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. అసలు ఈవెంట్ ను ప్లాన్ చేసింది.. ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఉండేలా చేసింది చిరంజీవి కోడలు ఉపాసన అని సమాచారం. ఇదొక్క సారే కాదు ఎప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా అందరిని కలపడానికి తనవంతు ప్రయత్నం చేస్తుందట ఉపాసన.

దీంతో ఉపాసనకు మెగా కుటుంబ సభ్యుల నుండి ప్రశంసలే ప్రశంసలట. మొదటి నుండి చిరంజీవి కూడా తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు.  ఇక మెగాస్టార్ కోడలు కూడా మామగారి బాటలో కుటుంబాన్ని కలిపి ఉంచే బాధ్యతను తీసుకుందన్నమాట.    చిరంజీవి తన కోడలమ్మను చూసి మురిసిపోతుంటారేమో..!