Begin typing your search above and press return to search.

ఆమెను ఆలా చేసారా ..? నాన్సెన్స్‌.!

By:  Tupaki Desk   |   20 Feb 2017 3:23 PM GMT
ఆమెను ఆలా చేసారా ..? నాన్సెన్స్‌.!
X
ఇదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్లుగా మారాయి ఇప్పటి పరిస్థితులు. తాజాగా తెలుగు.. తమిళ.. మలయాళ నటి భావన కిడ్నాప్ కావటం.. ఆపై లైంగిక వేధింపులకు గురైనట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. తీవ్ర సంచలనానికి దారి తీసిన ఈ ఉదంతంపై వస్తున్న వార్తలపై సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాను షూటింగ్ ను ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా.. తనను కిడ్నాప్ చేసి.. కారులో తిప్పుతూ గంటకు పైనే లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా భావన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్కడా కూడా తనను అత్యాచారం చేసినట్లుగా ఆమె పేర్కొనలేదు.కానీ.. ఇందుకు భిన్నంగా భావనను రేప్ చేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయటంపై జరుగుతున్న ప్రచారాన్ని మలయాళ సినీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఈ ఉదంతానికి సంబంధించిన ఆమె మాజీ డ్రైవర్ సునీల్.. ప్రస్తుత డ్రైవర్ మార్టిన్ తోపాటు.. మరికొంతమంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారిని విచారిస్తున్న పోలీసులు.. వారి దగ్గరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని.. అందులోని ఫోటోలు.. వీడియోల్ని పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆమెను లైంగికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ మలయాళ సినీ పరిశ్రమతో పాటు.. తమిళ సినీ పరిశ్రమ డిమాండ్ చేస్తున్నారు.

నిందితుల ఫోన్లను స్వాదీనం చేసుకున్న పోలీసులు.. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోల్ని.. వీడియోను.. సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేశారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. హీరోయిన్ భావనను రేప్ చేసినట్లుగా వస్తున్న వార్తలపై సినీ వర్గాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వేధింపులు జరిగినట్లుగా చెబితే.. రేప్ అంటూ ప్రచారం చేయటం దారుణమంటున్నారు. భావనకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. ఈ ఘటనతో ఆ పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగదంటున్నారు. ఇప్పుడు ఆమెకు అందరూ కలిసి మానసికస్థైర్యాన్ని ఇవ్వాలని పిలుపునిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సంచలనం కోసం కాకుండా.. మానవీయ కోణంలో ఆమెకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోటీతో పరుగులు తీసే మీడియా ఇలాంటివి వినే అవకాశం ఉందా? అన్నది ప్రశ్నగా చెప్పాలి.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/