ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకుంది..

Sun Dec 16 2018 16:20:43 GMT+0530 (IST)

హాలీవుడ్ లో మీటూ ప్రకంపనలు ఉవ్వెత్తిన ఎగిసిన సంగతి తెలిసిందే..  హాలీవుడ్ ప్రముఖ నిర్మాత హార్వీ వెయిన్ స్టెన్ పై ఎంతో మంది హాలీవుడ్ హీరోయిన్లు ఆరోపణలు చేశారు. అతడు తమ ను లైంగిక వేధించాడని కొందరు.. వాడుకున్నాడని మరికొందరు నటీమణులు ఆరోపణలు చేశారు. ప్రపంచవ్యాప్తం గా హార్వీ వెయిన్ స్టెన్ వ్యవహారం  దుమారం రేపింది.  ఆయన కేంద్రంగానే మీటూ ఉద్యమం హోరెత్తింది.తాజాగా జేన్ డో అనే నటి హార్వీ వెయిన్ స్టెన్ పై ఫైల్ చేసిన లా సూట్ డాక్యుమెంట్లో  ఓ సంచలన విషయం వెల్లడించింది. స్టార్ హీరోహీరోయిన్ల ను లొంగదీసుకోవడానికి ఇతడు తనకు ఆమెతో లైంగిక సంబంధం ఉందంటూ గొప్పలు చెప్పుకునేవాడని జేన్ డో నటి పేర్కొంది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ కూడా తనతో పడుకుంది అంటూ వెయిన్ స్టెన్ గొప్పగా చెప్పుకునేవాడని ఆరోపించింది.

జేన్ డో అనే యువతి తాజాగా వెయిన్ స్టెన్ పై లా సూట్ దాఖలు చేసింది. సన్ డాన్స్ ఫెస్టివల్ 2013లో తనను వేధించాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు టీఎంజడ్ అనే ఇంటర్నేషనల్ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. వెయిన్ స్టెన్ తనలో నీచంగా ప్రవర్తించేవాడని.. నా ముందే హస్త ప్రయోగం చేసి.. బలవంతంగా నా చేతిని అతడి అంగం పై పెట్టించే ప్రయత్నం చేసేవాడని.. ఓరల్ సెక్స్ కోసం బలవంతం చేసేవాడని జేన్ డో చెప్పినట్టు వెబ్ సైట్లో కథనం సంచలనం రేపుతోంది.

హార్వీ వెయిన్ స్టెన్ వ్యవహారం పై జెన్నిఫర్ లారెన్స్ కూడా తాజాగా స్పందించింది. ‘వెయిన్ స్టెన్ వల్ల ఇంత మంది మహిళలు లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసి షాక్ అయ్యాను. నాకు అతడితో ఎలాంటి లైంగిక సంబంధం లేదు. వృత్తి పరంగా ప్రొఫెషనల్ గా సంబంధం మాత్రమే ఉంది. నేను అతడితో పడుకున్నానని చెప్పడం అబద్ధం. మహిళలను లొంగదీసుకోవడానికి వేసే ఎత్తుగడ ఇది’ అంటూ జెన్నిఫర్ మండిపడింది. ఇలా వెయిన్ స్టెన్ వ్యవహారం తాజాగా హాలీవుడ్ లో దుమారం రేపుతోంది.