Begin typing your search above and press return to search.

సందీప్‌ సినిమాలో మ్యాటర్ ఉన్నట్లుందే..

By:  Tupaki Desk   |   28 July 2016 3:30 PM GMT
సందీప్‌ సినిమాలో మ్యాటర్ ఉన్నట్లుందే..
X
రన్.. ఒక్క అమ్మాయి తప్ప.. మొదలగు సినిమాల వరుస ఫెయిల్యూర్ తరువాత హీరో సందీప్‌ కిషన్‌ పెద్ద షాకే తిన్నాడు. అందుకే ఈసారి ఎలాగైనా కూడా కాస్త గాట్టి హిట్టు కొట్టాలని ఒక తమిళ సినిమాను నమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ఈ సినిమా తొలి పోస్టర్ను చూస్తుంటే మాత్రం.. ఖచ్చితంగా కొడతాడనే అనిపిస్తోంది.

గతంలో పిజ్జా సినిమాను ప్రొడ్యూసర్ చేసిన నిర్మాత సి.వి.కుమార్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు. ఇతగాడు సందీప్ ప్రధాన పాత్రలో తీస్తున్న సినిమా పేరు మాయావన్. ఈ సినిమా పోస్టర్ చూస్తే మాత్రం.. సినిమాలో ఏదో మాంచి థీమ్ ఉన్నట్లే అర్ధమవుతోంది. పోలీసు ఆఫీస్‌ పాత్రలో సందీప్.. అలాగే మాస్కు పెట్టుకున్న విలన్ గా కూడా మనోడే నటిస్తున్నాడని టాక్. ఈ పోస్టర్ ను చూస్తే రెండు మూడు హాలీవుడ్‌ సినిమాలు గుర్తొచ్చినప్పటికీ.. ఈ పోస్టర్లో కూడా విషయం కాస్త కనిపిస్తూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో జాకీ ష్రాఫ్‌ నటించిన ఏ తెలుగు/తమిళ సినిమా హిట్టు కాలేదు కాబట్టి.. ఆ ప్రభావం ఏమైనా ఉంటుందేమో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాతో తమిళంలో తన ఖాతా తెరవాలని చూస్తోంది స్పయిసీ అందాల సొగసరి లావణ్య త్రిపాఠి. విశేషం ఏంటంటే.. ఈ సినిమా పోస్టర్ ను నటి హన్సిక విడుదల చేసింది.