Begin typing your search above and press return to search.

ఆ రెండూ మాస్ కు పూనకం తెప్పించేశాయ్

By:  Tupaki Desk   |   28 Sep 2016 3:30 AM GMT
ఆ రెండూ మాస్ కు పూనకం తెప్పించేశాయ్
X
ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఒకసారి మాస్ లోకి వెళ్లి.. ఏ ఆటో డ్రైవర్ నో లేదంటే ఎవరన్నా చిన్న ఫ్యాక్టరీలో పనిచేసుకునే కార్మికుడినో తమకు నచ్చిన సినిమాల గురించి టచ్ చేసి చూశారా? ఒక మీడియా సంస్థ వారు అసలు నిజమైన పల్స్ తెలుసుకుందాం అని ప్రయత్నిస్తే.. వారికి నిజంగా మతిపోయే నిజాలు తెలశాయట.

ఒక ఆటో డ్రైవర్ ను గత ఆదివారం టివిలో 'బిచ్చగాడు' సినిమా వస్తుండగా.. ఎలా ఉంది బాసూ ఈ సినిమా అంటే.. ''అన్నా సంపేశాడన్నా.. అదిరిపోయింది. చాలా రియల్ గా అన్నీ చూపించేశాడన్నా'' అంటూ పూనకంతో ఊగిపోయాడట. అంతగా సినిమాలో ఏం నచ్చింది అంటే.. అమ్మ కోసం ఏ కొడుకు అలా చేస్తాడన్నా అంటూ వేదాంతం చెప్పేశాడట. ఈ సినిమా కాకుండా ఇక నీకు నచ్చిన సినిమా ఏదీ అంటే.. వెంటనే జనతా గ్యారేజ్ సినిమా పేరు చెప్పేశాడట. ''ఒక్కసారైన కూడా ఆ సినిమా చూడాలన్నా. మనం చెట్లన్నీ కొట్టేస్తున్నాం. ఆ సినిమాలో మంచి మెసేజ్ చెప్పాడన్నా'' అంటూ ఒక ఫ్యాక్టరీ కార్మికుడు వివరించాడట. మాస్ లో ఆ రేంజులో సినిమా కనక్ట్ అయ్యింది కాబట్టే.. అసలు ఈ సినిమాలకు ఆ రేంజులో కలక్షన్లు వచ్చాయి.

నిజానికి కేవలం సినిమాలపై విపరీతమైన గ్రిప్ ఉన్న సినిమా విశ్లేషకులు ఒక సినిమా తమకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ వచ్చిందో చెప్పమంటే వెంటనే టెక్నికాలిటీస్ డిస్కస్ చేస్తున్నారు.. కాని కామన్ ఆడియన్స్ మాత్రం కంటెంట్ గురించి ఇలా స్పష్టంగా మాట్లాడటం విశేషం.