Begin typing your search above and press return to search.

చైతూ కోసం డైరెక్టర్ వెయిటింగ్

By:  Tupaki Desk   |   24 March 2018 8:17 AM GMT
చైతూ కోసం డైరెక్టర్ వెయిటింగ్
X
ప్రస్తుతం తెలుగులో మాంచి ఊపుమీదున్న యువ కథానాయకుల్లో అక్కినేని నాగచైతన్య ఒకడు. అతను హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటి తర్వాత చైతూ రెండు మూడు కమిట్మెంట్లు ఇచ్చేశాడు. అవి కాక ఇంకో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. చైతూ నుంచి తర్వాత రాబోయే ‘సవ్యసాచి’ మీద అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమాతో పాటే చైతూ మారుతి దర్శకత్వంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. ఒక షెడ్యూల్ చేశారు. కానీ తర్వాత ఏ అప్ డేట్ లేదు. ఈ సినిమా ప్రోగ్రెస్ గురించి మారుతి ఈ రోజు ట్విట్టర్లో స్పందించాడు.

అందరూ తనను చైతూ సినిమా గురించే అడుగుతున్నారని.. ఐతే ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఒక షెడ్యూల్ అయ్యాక చైతూ ‘సవ్యసాచి’ కోసం వెళ్లిపోయాడని.. తాను కూడా అతడి కోసం వెయిటింగ్ లో ఉన్నానని.. మే నెలలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ ఉండొచ్చని వెల్లడించాడు మారుతి. అలాగే ఈ సినిమా ఎలా ఉండాలని ఆశిస్తారో అలాగే ఉంటుందని.. డోంట్ వర్రీ అని కూడా మారుతి హామీ ఇచ్చాడు. ఇంతకుముందు మారుతి ‘బాబు బంగారం’ తీసిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదే బేనర్లో చైతూ ‘ప్రేమమ్’ సినిమా చేశాడు. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.