Begin typing your search above and press return to search.

మారుతి..మారుతి హీరోయిన్‌..ఎక్సయిటెడ్‌

By:  Tupaki Desk   |   29 Aug 2015 7:00 AM GMT
మారుతి..మారుతి హీరోయిన్‌..ఎక్సయిటెడ్‌
X
నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన భలేభలే మగాడివోయ్ చిత్రం రిలీజ్‌ కి రెడీ అయింది. ఈ చిత్రానికి సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికేట్ రావడంతో... మాంచి జోష్ మీదున్నాడు డైరెక్టర్ మారుతీ. రిలీజ్ కి ఇంకా వారమే ఉండడంతో ఆన్ లైన్ లో పబ్లిసిటీ మొదలుపెట్టేశాడు. ఇప్పటివరకూ ఇలాంటి మతిమరుపు కేరక్టర్ ఏ హీరో ప్లే చేయలేదని... నాని యాక్షన్ కొత్తగా ఉంటుందంటున్నాడు మారుతీ. అలాగే మిడల్ క్లాస్ అమ్మాయిగా, క్లాసికల్ డ్యాన్స్ టీచర్ గా లావణ్య నటించదన్నాడు డైరెక్టర్. మళయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ తొలిసారిగా తెలుగులో మ్యూజిక్ ఇచ్చాడని.. నా కెరీర్ లోనే భలేభలే మగాడివోయ్ బెస్ట్ ఆల్బం అంటున్నాడు మారుతీ.

తన స్క్రీన్ హీరో నాని సూపర్ అని.. అమేజింగ్ యాక్టర్, డౌన్ టు ఎర్త్ ఉంటాడంటూ... లావణ్య తెగ పొగిడేసింది. మారుతీకి డెడికేషన్ ఎక్కువని... ఎప్పుడూ జోవియల్ ఉంటూ... సెట్స్ మీద కూడా బోలెడు కామెడీ చేస్తాడని చెప్పింది లావణ్య. అలాగే గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో చేయడం సంతోషంగా ఉందిట. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. మారుతీ డైరెక్షన్ లో వచ్చిన సినిమాకి.. క్లీన్ యూ సర్టిఫికేట్ అంటే... తన జోనర్ కాకుండా... ఖచ్చితంగా కొత్తగా ట్రై చేసి ఉంటాడని అర్ధమవుతుంది.

అయితే ఒక ప్రక్కన మారుతి, మరో ప్రక్కన లావణ్య చాలా ఎక్సయిటెడ్‌ గా సినిమాను ప్రమోట్‌ చేయడం చూస్తుంటే మాత్రం ముచ్చటేస్తుంది. నిజానికి ఈ సినిమా ఈ ఇద్దరికీ చాలా ముఖ్యం. మారుతికి ఒక పెద్ద బ్రేక్‌ రావాలి.. అలాగే లావణ్యకూ స్టార్‌ హీరోయిన్‌ ట్యాగ్‌ రావాలి. రెండింటిలో ఏది జరగాలన్నా కూడా సినిమా పెద్ద హిట్టవ్వాలి. అందుకే మనోళ్ళు ఈ రేంజులో పబ్లిసిటీ ఇస్తున్నారా అనిపిస్తోంది. చూద్దాం మరి.