మెగా హీరోతో మూవీకి మారుతి రెడీ

Wed May 16 2018 23:15:56 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ఏ దర్శకుడికి అయినా.. ఓ కామన్ టార్గెట్ ఉంటుంది. ఒక్క సినిమా మెగా క్యాంప్ లో ఓకే చేయించుకుంటే.. ఇక ఆ లెక్కే వేరుగా ఉంటుంది. ఆ ఫ్యామిలీలో అనేక మంది హీరోస్ ఉండడంతో.. ఒక్క హిట్ ఇస్తే చాలు.. ఒకరి తర్వాత ఒకరితో సినిమాలు చేసే ఛాన్స్ అందుకోవచ్చు. అందరికీ అల్టిమేట్ టార్గెట్ మెగాస్టార్ కానీ.. మెగా పవర్ స్టార్ కానీ ఉంటారు(ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలు చేయడం లేదు కదా).అడల్ట్ కామెడీ సినిమాలతో మొదలుపెట్టి.. ఇప్పుడు క్లీన్ కామెడీకి కేరాఫ్ అయిపోయిన దర్శకుడు మారుతికి కూడా.. మెగా హీరోల్లో ఒక స్టార్ తో సినిమా చేయాలన్నది చాలా కాలం నుంచి డ్రీమ్. అల్లు అర్జున్ కి కథ చెప్పాడంటూ గతంలో కొన్ని సార్లు న్యూస్ వచ్చాయి. అయితే.. ఇప్పటివరకూ అల్లు శిరీష్ తో కొత్తజంట అంటూ ఓ యావరేజ్ సినిమా మాత్రమే అందించగలిగాడు మారుతి. అయితే.. భలేభలే మగాడివోయ్ అంటూ గీతాఆర్ట్స్2 బ్యానర్ కు హిట్ ఇవ్వడం.. ఆ తర్వాత మహానుభావుడితో మెప్పించడంతో.. ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా ఛాన్స్ అందుకున్నాడు మారుతి.

చైతుతో శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత.. మళ్లీ మెగా క్యాంప్ లోకి మారుతి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైందట. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సాయి ధరం తేజ్.. కరుణాకరన్ తో తీస్తున్న తేజ్ ఐలవ్యూ మూవీపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత తేజు చేయబోయే మూవీ మారుతి తోనే అని టాక్ వినిపిస్తోంది.