Begin typing your search above and press return to search.

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే-మారుతి

By:  Tupaki Desk   |   25 July 2016 5:04 AM GMT
ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే-మారుతి
X
బాబు బంగారం సినిమా విక్టరీ వెంకటేష్ అభిమానులకు విందు భోజనమే అంటున్నాడు మారుతి. వెంకీని తాను ఓ అభిమానిగా ఎలా చూడాలనుకుంటానో ‘బాబు బంగారం’లో అలాగే చూపించానని మారుతి అన్నాడు. ట్రైలర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని.. సినిమాలో ఇంకా చాలా ఉంటుందని.. అభిమానులు గర్వపడేలా ‘బాబు బంగారం’ ఉంటుందని అతను కాన్ఫిడెంటుగా చెప్పాడు.

‘‘వెంకటేష్ గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. ఆయనతో పని చేయడం అన్నది చాలామందికి కల. నేను ఆ కల నెరవేర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వెంకటేష్ లాంటి స్టార్ హీరో నాకు అవకాశం ఇచ్చి.. నన్ను స్టార్ డైరెక్టర్ని చేశారు. అభిమానులు వెంకీని ఎలా చూడాలనుకుంటారో ఆలోచించి ఈ సినిమా చేశా. వాళ్లు గర్వించేలాగా ఒక విందుభోజనం లాగా ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా చాలా ఉంది. నన్ను వెంకటేష్ గారి అభిమానులు బాగా కంగారు పెట్టేశారు. మా హీరోను అలా చూపించండి.. ఇలా చూపించండి అంటూ మొదట్నుంచి చెబుతూ వచ్చారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సినిమా చేశాను.

సురేష్ బాబు గారు తన కుటుంబ సభ్యుడిలాగా నన్ను చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి సినిమా ఎలా వస్తోందో అడిగారు. నన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా సినిమా పూర్తి చేసేందుకు సహకారం అందించారు. నాకు సురేష్ ప్రొడక్షన్ లోనే పని చేసినట్లుంది. దాసరి నారాయణరావుగారి ఇంటి పేరు నా ఇంటిపేరు ఒక్కటే. అలాంటి పెద్ద వ్యక్తి చేతుల మీదుగా ‘బాబు బంగారం’ ఆడియో విడుదల కావడం నా అదృష్టం’’ అని ఆడియో వేడుకలో మారుతి అన్నాడు.