Begin typing your search above and press return to search.

మారుతి.. ఈ దెబ్బతో చెరిపేస్తాడట

By:  Tupaki Desk   |   30 Aug 2015 6:29 PM GMT
మారుతి.. ఈ దెబ్బతో చెరిపేస్తాడట
X
తెలుగులో డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాలు తీసిన వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ వాళ్లందరికంటే మారుతి చాలా అడుగులు ముందుకేశాడు. ‘బస్ స్టాప్’ సినిమా పెద్ద హిట్టయితే అయ్యుండొచ్చు, నిర్మాతకు బాగా డబ్బులు తెచ్చి పెట్టి ఉండొచ్చు కానీ.. అందులో డబుల్ మీనింగ్ డైలాగులు, సన్నివేశాల విషయంలో తీవ్ర విమర్శలొచ్చాయి. మారుతి సినిమాలకు వెళ్లాలంటే లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ హడలి చచ్చేంత ఇమేజ్ తెచ్చుకున్నాడతను. ఐతే తనపై వచ్చిన విమర్శలతో తర్వాతి సినిమా నుంచి మారుతూ వచ్చాడు మారుతి. ‘ప్రేమకథా చిత్రమ్’లో చాలా వరకు డబుల్ మీనింగ్, బూతు మాటలు తగ్గాయి. ‘కొత్త జంట’లోనూ ఆ కంటెంట్ తగ్గించాడు. అయినప్పటికీ ఒకట్రెండు సన్నివేశాల్లో ప్రేక్షకులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం.

ఐతే ‘భలే భలే మగాడివోయ్’ మాత్రం మారుతి మీద ఉన్న ముద్రను పూర్తిగా చెరిపేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఎక్కడా బూతు, డబుల్ మీనింగ్ కంటెంట్ లేకుండా అల్లు అరవింద్ అండ్ టీమ్ చాలా జాగ్రత్త పడ్డారట. తమ బేనరుకున్న పేరును దృష్టిలో ఉంచుకుని.. ఎక్కడా తేడా రానివ్వొద్దని స్క్రిప్టు దశలోనే మారుతికి వార్నింగ్ ఇచ్చారని.. దీంతో మారుతి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడని సమాచారం. ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాలుండవని.. హీరోయిన్ ను కూడా నీట్ గా చూపించాడని.. ఫ్యామిలీ ఆడియన్స్ నిరభ్యంతరంగా ఈ సినిమా చూడొచ్చని.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందని గీతా ఆర్ట్స్ వర్గాలు అంటున్నాయి. ట్రైలర్ తో ఇప్పటికే ఆకట్టుకున్న ‘భలే భలే మగాడివోయ్’ సెప్టెంబరు 4న మంచి క్రేజ్ తో విడుదలవుతోంది.