Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మెస్మరైజ్ చేస్తున్న మిస్ వరల్డ్

By:  Tupaki Desk   |   23 Sep 2018 5:58 AM GMT
ఫోటో స్టొరీ: మెస్మరైజ్ చేస్తున్న మిస్ వరల్డ్
X
బీకాం లో ఫిజిక్స్ ఉంటుందో లేదో తెలీదు కానీ దాదాపుగా మోడలింగ్ రంగంలో ఉన్న వారి ఫైనల్ గోల్ సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన ఇండియా బ్యూటీ కి నెక్స్ట్ గోల్ సినిమాఅనే విషయం ఎవరినడిగినా చెప్తారు. మరి ఈ ఏడాది మిస్ వరల్డ్ మానుషి Mr. పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కు అభిమాని. ఎప్పటికైనా ఆమిర్ ఖాన్ సినిమాలో నటించాలని తనకు కోరిక ఉందని ఎప్పుడో బయటపెట్టింది.

ఆ అవకాశం ఎప్పుడొస్తుందో తెలీదు గానీ కరణ్ జోహార్ సిద్ధార్థ మల్హోత్రా హీరో గా నిర్మించనున్న సినిమాలో మానుషి ని హీరోయిన్ గా తీసుకున్నాడని ఇప్పటికే బాలీవడ్ మీడియాలో రూమర్లు వచ్చాయి. ఇవన్నీ పక్కన బెడితే మానుషి రీసెంట్ గా తన గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి లాస్ ఏంజెలెస్ కు వెళ్ళింది... హాలిడే ట్రిప్. దీంతో ఫుల్ గా ఎంజాయ్ చెయ్యడమే పని. పనిలో పనిగా ఫోటోలు దిగి ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది.

తాజాగా రెండు ఫోటోలు పోస్ట్ చేసి ఇలా క్యాప్షన్ పెట్టింది.. "లవ్.. లైట్.. లాఫ్టర్.. LA". ఇక పూల డిజైన్ ఉన్న అలిఫ్ లైలా టైపు డిజైనర్ డ్రెస్ లో కాస్త అందాలను నెటిజనులకోసం ధారపోస్తూ లాస్ ఏంజెలెస్ రోడ్ల మీద నిలబడి చిరునవ్వులు చిందిస్తూ పోజిచ్చింది. ఒక్క రోజులోనే 3.8 లక్షల లైకులు వచ్చాయి. మరేమనుకున్నారు.. 4.4 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు ఈ భామకు!