Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా జనాలపై హాటీ కామెంట్‌

By:  Tupaki Desk   |   23 July 2016 5:30 PM GMT
తెలుగు సినిమా జనాలపై హాటీ కామెంట్‌
X
పుట్టుకతో పెట్టిన పెట్టిన పేరు బార్బీ హాండా అయినా.. సినిమాల కోసం మన్నారా చోప్రాగా పేరు మార్చుకుని రంగంలోకి దిగిపోయింది ప్రియాంక చోప్రా కజిన్. టాలీవుడ్ సినిమాతోనే అరంగేట్రం చేసినా.. ఇప్పటివరకూ ఈమెకు బ్రేక్ రాలేదు. ఆ తర్వాత ఓ హిందీ - ఓ తమిళ్ మూవీ కూడా ట్రై చేసింది. ఇప్పుడు మళ్లీ తెలుగులోనే బాగా బిజీ అయిపోయింది.

ఇప్పుడు మన్నారా ఎంత బిజీ అంటే.. ఒకేసారి మూడు తెలుగు సినిమాల షూటింగ్ లు చేసేసింది. అందులో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి కూడా. వచ్చే వారి విడుదల కానున్న సునీల్ మూవీ జక్కన్నలో మన్నారా చోప్రా ఓ హీరోయిన్. 'తెలుగు సినిమా జనాలు బాగా ప్రొఫెషనల్. ఆడియన్స్ కూడా బాగా ఫ్రెండ్లీ. సినిమా బాగుంటే చాలు సూపర్ హిట్ చేసేస్తారు. అందుకే తెలుగులో ఎక్కువగా నటిస్తున్నా' అంటోంది మన్నారా. సునీల్ తో కామెడీ టైమింగ్ విషయంలో పోటీ పడ్డం కష్టమే అయినా.. జక్కన్నలో మాత్రం ఇరగదీసేశా అంటోంది. సప్తగిరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కు పొట్ట చెక్కలయిపోవడం ఖాయం అని కూడా అంటోంది.

ఇక సునీల్ మూవీ జక్కన్న వచ్చాక మరో రెండు వారాల్లో విడుదలయ్యే సాయి ధరంతేజ్ మూవీ తిక్కలో కూడా యాక్ట్ చేసింది మన్నారా చోప్రా. వీటితో పాటు పూరీ జగన్నాథ్ సినిమా రోగ్ సెట్స్ పై ఉంది. అన్నీ ఆడేస్తే.. అమ్మడు ఇక్కడ బిజీ అయిపోవడం ఖాయం.