'మన్మథుడు 2' న్యూ అప్ డేట్స్

Sun Jan 20 2019 16:57:34 GMT+0530 (IST)

అక్కినేని నాగార్జున కెరీర్ లో 'మన్మథుడు' చిత్రంకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను దక్కించుకున్న నాగార్జునకు మన్మథుడు చిత్రం ఎప్పటికి మర్చిపోలేని విజయాన్ని తెచ్చి పెట్టింది. ఆ చిత్రం తనకు చాలా ప్రత్యేకమంటూ నాగార్జున చాలా సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఆ చిత్రానికి సీక్వెల్ అనగానే నాగార్జున కాస్త బెండ్ అవ్వడం కామన్. అందుకే రాహుల్ రవీంద్రన్ చెప్పిన 'మన్మథుడు 2' స్టోరీకి నాగార్జున ఫిదా అయ్యాడు.'చి.ల.సౌ' చిత్రంతో దర్శకుడిగా డీసెంట్ సక్సెస్ ను దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ తన రెండవ సినిమాగా 'మన్మథుడు 2'ను చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. నాగార్జున కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున మీడియం బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ను పోర్చుగల్ దేశంలో ప్లాన్ చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 'మన్మథుడు 2' చిత్రంలో రావు రమేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.

'మన్మథుడు 2' చిత్రంతో పాటే నాగార్జున 'బంగార్రాజు' చిత్రాన్ని కూడా చేయబోతున్నాడు. నాగచైతన్యతో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రంలో నటించబోతున్నాడు. బంగార్రాజు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేస్తున్నాడు. ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగితే 'మన్మథుడు 2' చిత్రం దసరా లేదా దీపావళికి వస్తుందేమో చూడాలి.