Begin typing your search above and press return to search.

ఓవ‌ర్సీస్ లో `మ‌న్మ‌ధుడు 2` స‌న్నివేశం

By:  Tupaki Desk   |   12 Aug 2019 6:10 AM GMT
ఓవ‌ర్సీస్ లో `మ‌న్మ‌ధుడు 2` స‌న్నివేశం
X
కింగ్ నాగార్జున న‌టించిన `మ‌న్మ‌ధుడు 2` బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా? ప‌్ర‌స్తుతం ట్రేడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. లేట్ ఏజ్ మ‌న్మ‌ధుడి క‌థ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో వ‌ర్క‌వుట‌వ్వ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రుస్తోంది. అయితే కాస్త ఆల‌స్యంగా అయినా ఈ సినిమా అంద‌రికీ క‌నెక్ట‌వుతుంద‌ని నాగార్జున ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌వంతుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో అభిమానుల‌కు ట‌చ్ లోకి వెళుతున్నారు. మ‌న్మ‌ధుడు 2 చిత్రం ఇటు తెలుగు రాష్ట్రాలు స‌హా అటు ఓవ‌ర్సీస్ లోనూ ఆశించిన రిజ‌ల్ట్ ద‌క్కించుకోలేద‌ని తాజాగా రివీలైన బాక్సాఫీస్ గ‌ణాంకాలు చెబుతున్నాయి. తొలి రోజు విమ‌ర్శ‌కుల నుంచి వ‌చ్చిన మిశ్ర‌మ స్పంద‌న‌లు రావ‌డం ఒక‌రకంగా మ‌న్మ‌ధుడికి మైన‌స్ గా మారింద‌నే చెప్పాలి.

వాస్త‌వంగా కింగ్ నాగార్జున ఓవ‌ర్సీస్ రేంజ్ ఎంత‌? అంటే అత‌డు న‌టించిన మ‌నం.. ఊపిరి లాంటి సినిమాల్ని ఉద‌హ‌రిస్తారు. అమెరికాలో ఈ చిత్రాలో మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ (10ల‌క్ష‌ల డాల‌ర్లు)లో చేరాయి. అందుకే ఈసారి మ‌న్మ‌ధుడు 2 కూడా ఆ స్థాయిని అందుకుంటుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. కానీ ఈ చిత్రం అమెరికా స‌హా ఇత‌ర దేశాల్లోనూ ఓపెనింగ్స్ ప‌రంగా వెన‌క‌బ‌డింద‌ని తాజా రిపోర్ట్ చెబుతోంది. అమెరికాలో 150 పైగా లొకేషన్లలో రిలీజైన ఈ చిత్రం తొలి వీకెండ్ కేవ‌లం 2ల‌క్ష‌ల డాల‌ర్ల‌తోనే స‌రిపుచ్చుకుంది. ప్రీమియర్స్ ద్వారా $82,190 వసూళ్లు సాధించింది. తొలిరోజు గురువారం ఫ‌ర్వాలేద‌నిపించినా ఆ త‌ర్వాత రివ్యూల ప్ర‌భావంతో పూర్తిగా క‌లెక్ష‌న్స్ ప‌డిపోయాయి. ఈ చిత్రం ప్రీమియర్స్ తో కలుపుకొని మూడు రోజులకు గాను $215k వసూళ్లు సాధించింది. ఇక సెలవు దినం ఆదివారం అదే రిజ‌ల్ట్ రిపీటైంద‌ని తెలుస్తోంది. నాలుగు రోజులలో రణరంగం,ఎవరు వంటి చిత్రాల విడుదల నేపథ్యంలో మన్మధుడు 2 కలెక్షన్స్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.

మ‌న్మ‌ధుడు2 అమెరికా వ‌సూళ్లు ప‌రిశీలిస్తే.. ప్రీమియ‌ర్ల‌తో 82కె డాల‌ర్లు వ‌సూల‌వ్వ‌గా.. శుక్ర‌-47కె డాల‌ర్లు, శ‌ని-62కె డాల‌ర్లు, ఆది-25కె డాల‌ర్లు వ‌సూలైంది. అంటే మూడు రోజుల‌కు 135కె డాల‌ర్లు మాత్ర‌మే వ‌సూలైంది. నాగార్జున రేంజ్ బిగ్ స్టార్ కి ఇది ఎంతో త‌క్కువ‌ అనే చెప్పాలి.