Begin typing your search above and press return to search.

మ‌హేష్ సోద‌రి డైరెక్ష‌న్‌

By:  Tupaki Desk   |   31 May 2016 4:55 AM GMT
మ‌హేష్ సోద‌రి డైరెక్ష‌న్‌
X
సూప‌ర్‌ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజున ఆయ‌న ఇంటి నుంచి మ‌రో తీపి క‌బురు వినిపించింది. కృష్ణ గారాల ప‌ట్టి - మ‌హేష్‌ బాబు సోద‌రి అయిన మంజుల ద‌ర్శకురాలిగా మారారు. ఇప్ప‌టిదాకా నిర్మాత‌గా - న‌టిగానే ప‌రిచ‌య‌మైన ఆమె త్వ‌ర‌లోనే కెప్టెన్ కుర్చీ ఎక్క‌బోతున్నారు. నాని క‌థానాయ‌కుడిగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ఆమె స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం అందింది. నాని కూడా మంజుల త‌యారు చేసిన క‌థ‌ని చూసి వండ‌ర్ అయ్యాడ‌ట‌. వెంట‌నే సినిమా చేసేందుకు అంగీకారం తెలిపాడ‌ట‌.

ప్ర‌స్తుతం జెంటిల్‌ మేన్‌ లో న‌టిస్తున్న ఆయ‌న ఆ చిత్రం పూర్త‌యిన వెంట‌నే మంజుల చిత్రం కోసం రంగంలోకి దిగుతాడ‌ని తెలుస్తోంది. ఆ త‌ర్వాతే అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. మంజులలో డైరెక్ట‌ర్ ఉంద‌న్న విష‌యం సూప‌ర్‌ స్టార్ ఫ్యాన్స్‌ నే కాదు, తెలుగు ఇండ‌స్ట్రీ జ‌నాల్ని కూడా ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. కావ్యాస్ డైరీ త‌ర్వాత ఆమె సినిమా నిర్మాణానికి కూడా దూరంగా ఉన్నారు. రామ్‌ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఆరెంజ్‌ లో మాత్రం త‌ళుక్కున మెరిశారు. అప్ప‌ట్నుంచి ఆమె సినిమాల‌తో అంటీముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఎందుకొచ్చిన వ్య‌వ‌హారంలే అని సైడ్ అయిపోయుంటుంద‌ని అనుకొన్నారంతా. కానీ ఇలా మెగాఫోన్‌ తో మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తుంద‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. నానితో తీస్తున్న సినిమా స‌క్సెస్ అయితే మాత్రం మంజుల‌- మ‌హేష్‌ బాబు కాంబినేష‌న్‌ లో కూడా సినిమాని ఆశించొచ్చ‌న్న‌మాట‌.