Begin typing your search above and press return to search.

హీరోయిన్ అవుతున్న మహేష్‌ మేనకోడలు?

By:  Tupaki Desk   |   24 Nov 2017 5:32 PM GMT
హీరోయిన్ అవుతున్న మహేష్‌ మేనకోడలు?
X
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఘట్టమనేని కృష్ణ అప్పట్లో రికార్డ్ స్థాయిలో సినిమాలను తీసేవారు. ఇక తర్వాత ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా ఎంతో కష్టపడి సూపర్ స్టార్ గా ఎదిగి సౌత్ ఇండస్ట్రీలోనే 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ హీరోగా సక్సెస్ అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. అయితే మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని కూడా మాంచి తెరపై హీరోయిన్ అవ్వాలని అనుకుందట.

మొదట్లో అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేసిందట. కానీ వర్కవుట్ కాలేదు. ఆమె హీరోయిన్ కావడానికి వీల్లేదని ఫ్యాన్స్ గొడవపెట్టారు. అందుకే బాలయ్యతో సినిమా మొదలై ఆగిపోయింది. ఆ తరువాత కొన్నేళ్ళకు నటిగా కొన్ని సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంజుల. చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో మంజులని గుర్తుపట్టే వారు చాలా మంది ఉన్నారు. అయితే హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయాను అనే బాధను కొంతలో కొంత అయినా తీర్చుకోవడానికి ఆమె తన కూతురుని రంగుల ప్రపంచంలోకి దింపనుందట. ఎలాగైనా తన కూతురు జాన్విని హీరోయిన్ గా చూడాలని ఇప్పటి నుండే వెండితెరను పరిచయం చేయిస్తోంది.

ప్రస్తుతం ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక లవ్ స్టోరీలో ఒక మంచి క్యారెక్టర్ ని చేయించనున్నారట మంజుల. ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా షూటింగ్ స్పాట్ లో సందీప్ పక్కనే కనిపించి ఇంప్రెస్ చేస్తోంది. ''తనను ఎప్పుడే షూట్ లోకి రానివ్వలేదు. అందుకే మొదటి సారి తను షూటింగ్ లోకి రాగానే నర్వస్ గా అనిపించింది. కానీ మొదటి సీన్ షూట్ చేసిన తర్వాత తనపై నాకు నమ్మకం పెరిగింది. తను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటి మహేష్‌ ను గుర్తు చేస్తోంది'' అంటూ చెప్పింది మంజుల. ఈ సినిమా తరువాత మహేష్‌ మేనకోడలు మరి హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుందా? వెయిట్ అండ్ సి.