స్టార్ హీరోకు జోడీగా ఆంటీనా?

Tue Jan 22 2019 22:08:07 GMT+0530 (IST)

తమిళ స్టార్ హీరో ధనుష్ - వెట్రిమారన్ ల కాంబినేషన్ లో ఇప్పటికే 'పొల్లాదవన్' - 'ఆడుగళం' - 'వడ చెన్నై' చిత్రాలు వచ్చి హిట్ కాంబినేషన్ గా గుర్తింపు దక్కించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో నాల్గవ సినిమాకు అధికారిక ప్రకటన వచ్చింది. చాలా విభిన్నంగా వీరి కాంబోలో తాజా చిత్రం ఉండబోతున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో వెట్రిమారన్ బిజీగా ఉన్నాడట. 'అసురన్' అనే టైటిల్ తో ఈ చిత్రంను రూపొందించబోతున్నారు. ధనుష్ ఈ చిత్రంలో నెగటివ్ ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. మద్య వయస్కుడి పాత్రలో ధనుష్ కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రంలో ధనుష్ కు జోడీగా సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ ను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. మలయాళ వివాదాస్పద నటుడు దిలీప్ భార్య మంజు వారియర్. ఈమె అప్పట్లో హీరోయిన్ గా చేసి ఆఫర్లు రాకపోవడంతో సినిమాలకు దూరం అయ్యింది. ఈమద్య రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టు గా రాణిస్తుంది. దాదాపుగా నాలుగు పదుల వయసు ఉండే మంజు వారియర్ ఇప్పుడు ధనుష్ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కొందరు తప్పుబడుతున్నారు. సూపర్ స్టార్ స్థాయి క్రేజ్ ఉండే ధనుష్ కు జోడీగా ఒక ఆంటీని హీరోయిన్ గా నటింపజేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా - మరి కొందరు మాత్రం అవి పక్కాగా పుకార్లే అయ్యి ఉంటాయని - అలాంటి సాహసం ధనుష్ చేయడని అంటున్నారు. అతి త్వరలోనే 'అసురన్' చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతుంది. సినిమా ప్రారంభం అయితే హీరోయిన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.