ఫోటో స్టోరి: లింజరీలోకి దిగిపోయావేంటి బేబి

Mon Mar 20 2017 11:01:16 GMT+0530 (IST)

చేతిలో సినిమాలు లేవు. పెద్దగా వచ్చే ఛాన్సులు కూడా కనిపించట్లేదు. ఈ సమయంలో ఏదో ఒకటి చేయాలి. అందుకే మొన్న సెచెల్లీస్ లో హాలిడేస్ కు వెళ్ళినప్పుడు అమ్మడు మంజరీ ఫద్నీస్ వెంటనే బికినీలో ప్రత్యక్షమై.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇంకేముంది.. రావల్సినంత హైప్ ఆటోమ్యాటిక్ గా వచ్చేసింది. అయితే వాటి వలన సినిమా ఛాన్సులు రాలేదు కాని.. వెంటనే ఒక హాట్ ఫ్యాషన్ వాక్ అవకాశం మాత్రం వచ్చిందిలే.నిన్న జరిగిన ఒక ఇంటిమేట్ వేర్ ఫ్యాషన్ వీక్లో హల్ చల్ చేసింది.. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం బ్యూటి మంజరీ. అమ్మడు కూడా భారీ భారీ అందాలతో తన ఒంపుసొంపులను ఆవిష్కరిస్తూ.. ఒక ప్రత్యేకమైన నైట్ డ్రస్ తరహాలోని లింజరీలోకి జారిపోయింది. అలా తన సోకులను ఆరబోస్తూ.. వెంటనే అమ్మడు రా్యంపుపై హొయలొలికిస్తూ నడిచేసింది. ఇంకేముంది.. చూపరులు అందరూ తమ గుండె ఎద్దడిని కంట్రోల్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు.

మొత్తానికి మంజరి ఇప్పుడు ఫ్యాషన్ వాకులతో కూడా సోకులు కురిపిస్తుంటే.. చివరకు సినిమావారు ఎవరైనా ఏమైనా అవకాశాలు ఇస్తారో లేదో తెలియాలంటే మాత్రం కాస్త వేచి చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/