పెళ్లా... మళ్లీ ఆ తప్పు చేయను - మనీషా

Thu Jun 14 2018 08:00:01 GMT+0530 (IST)

సెలబ్రిటీలు అయినా సామాన్యులు అయినా పెళ్లి తర్వాత కష్టాలు అంటూ వస్తూ అందరి బాధా ఒకే రకంగా ఉంటుంది. పెటాకులు అయిన పెళ్లి మనసును కకావికలం చేస్తుంది. ఇపుడు అలాంటి అలజడిలోనే ఉన్నారు మనీషా కొయిరాలా. 90-2000 దశకాల్లో భారత యువతను గిలిగింతలు పెట్టిన ఈ అందాల బొమ్మ నేపాలీ. ప్రస్తుతం  సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ‘సంజు’లో దత్ తల్లి నర్గీస్ పాత్రలో మనీషా కనిస్తోంది. అందుకే మీడియా ముందుకు వచ్చింది.  ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు.  అందం చిలిపితనం కలగలపిన ఈ పాలరాతి శిల్పం వంటి మగువ జీవితం అంత సాఫీగా లేదు. పెళ్లి ఆరోగ్యం... ఇలా కష్టాలు ఒకదానిమీద ఒకటి వచ్చాయి. ప్రస్తుతం అంతా ఓకే అయినా ఆ బాధ నుంచి భామ ఇంకా తేరుకోనట్టుంది. 2010లో తన దేశానికే చెందిన దహల్ అనే ఒక వ్యాపారవేత్తను మనీషా పెళ్లాడింది. కానీ వారి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. 2012లో వారు విడిపోయారు. తాజాగా దీనిపై మరోసారి స్పందించిన మనీషా ఆ  పెళ్లి పెటాకులు కావడానికి కారణం తనే అంటోంది. అసలు నేను పెళ్లి చేసుకోవడం జీవితంలో చేసిన అతి పెద్ద తప్పని వ్యాఖ్యానించింది. ఇంకోసారి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పేర్కొంది. ఒంటరి జీవితానికే నా ఓటని స్పష్టం చేసింది.

ఇంతకీ ఈ భామ సమస్య ఏంటంటే... పెళ్లి చేసుకోవడం అంటే మన జీవితాన్ని వేరే వాళ్ల చేతిలో పెట్టడం లాంటిదట. అలా చేసి  తాను ఇంకా వెనుకబడాలని అనుకోవడం లేదని చెప్పింది. ఇక ప్రేమ-పెళ్లి ... ఈ రెండింటికీ మనీషా జీవితంలో చోటే లేదని డిసైడన్లు గట్టిగా తేల్చేసింది. బహుశా ఇంకెపుడు దాని గురించి నన్ను అడగొద్దని మీడియాకు చెప్పే ఉద్దేశంతో ఇంత గట్టిగా వ్యాఖ్యలు చేసినట్టుంది.

అయితే ఈ సందర్భంగా ఒక మంచి నిర్ణయం మాత్రం ఆమె ప్రకటించారు. ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని అనిపిస్తోందని.. ఇప్పట్లో కుదరడం లేదు కానీ భవిష్యత్తులో ఆ పనిచేస్తానని చెప్పింది. ఎందుకంటే ఇపుడు బిజీగా ఉన్నాను. బిడ్డను దత్తత తీసుకుంటే బాగా టైం కేటాయించాలి. ఇపుడు నా వద్ద అంత టైం లేదు. కొంతకాలం తర్వాత నేను బిడ్డ కోసం సమయం వెచ్చించగలిగినపుడు మాత్రమే దత్తత తీసుకుంటానని ఆమె చెప్పారు. అయినా ప్రేమకు కూడా జీవితంలో చోటు లేదని చెప్పేసిన ఈ భామ దత్తత బిడ్డకు ప్రేమ ఎలా చూపుతుందో మరి!