Begin typing your search above and press return to search.

మణిరత్నం నటుల లిస్ట్ రెడీ

By:  Tupaki Desk   |   16 Aug 2017 5:19 AM GMT
మణిరత్నం నటుల లిస్ట్ రెడీ
X
మన దేశంలో ఏ ఇండస్ట్రికి వెళ్ళి ఒక స్టార్ని మీరు ఏ డైరెక్టర్ తో పని చేయాలిని అనుకుంటున్నారుని అడిగితే ఆలోచించకుండా చెప్పే ఒక సమాధానం.. మణిరత్నం. ఇంతలా ప్రతి ఒక్క నటుడును నటినీ ప్రభావితం చేసిన డైరెక్టర్ ఈ మధ్య కాలంలో లేడనే చెప్పాలి. మణిరత్నం కథలు కానీ అతను సినిమాలో పాత్రలు కానీ ఒక నటుడుకి దక్కిన ఆభరణంలాంటిదే అని చెప్పవచ్చు. అలాంటి డైరెక్టర్ ఈ మధ్య కొన్ని ఫ్లాప్ సినిమాలు తీసిన ఇప్పటికీ అతని పై ఎవరికి ఇసుముంత నమ్మకం కూడా తగ్గలేదు. అదే మణిరత్నం మ్యాజిక్. అతను పెట్టిన ఫ్రేమ్ లో ఒక్క వస్తువైన పర్వాలేదు చేస్తాం అనే నటులు ఇప్పటికీ ఉన్నారు.

‘చెలియా’ ఫ్లాప్ తరువాత మణి ఏ సినిమా తీయబోతున్నాడు ఎవరిని తీసుకోబోతున్నాడు అనేది తమిళనాడులో పెద్ద ఉత్కంఠ ఏర్పడింది కొద్ది నెలలు కిందట వరకు. ఎందుకంటే మణిరత్నం కథ సిద్దం చేసుకున్నాడు కాస్టింగ్ ఒకటే మిగిలి ఉంది అని తెలిసింది. ఇప్పుడు మణిరత్నం కొత్త కథలో నటించబోయే నటులు ఎవరో కొంతవరకు తెలిసింది. ఇందులో ఇద్దరు మణి రత్నం సినిమా హీరోలే అవ్వడం విశేషం. మణిరత్నం తదుపరి సినిమాలో మాధవన్ - దుల్కర్ సల్మాన్ - అదితి రావు హైదారి - మరో మలయాళం నటుడు ఫహధ్ ఫాసిల్ అనుకుంటునట్లు ఒక వార్త బయటకు వచ్చింది. వీళ్ళే కాకుండా తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ని కూడా ఈ మధ్య కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు. మణిరత్నం అడిగినిదే తడువుగా విజయ్ సేతుపతి డబుల్ యెస్ చెప్పాడు అని కూడా చెబుతున్నారు. రేపో మాపో అధికారికంగా ఈ నటుల లిస్ట్ ని బయటపెట్టవచ్చు.

ఈ మణిరత్నం కథకు గ్రేట్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేయనున్నాడు. మరి అన్న సినిమా తీస్తే సంగీతం ఇచ్చేది తమ్ముడు ఏ ఆర్ రహ్మానే కదా. అయితే మన తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ తో తీయవలిసిన సినిమా మరి ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఏంటో!!