Begin typing your search above and press return to search.

మణి సార్ డైరక్షన్ లో MCA కుర్రాడు

By:  Tupaki Desk   |   19 Aug 2017 11:14 AM GMT
మణి సార్ డైరక్షన్ లో MCA కుర్రాడు
X
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తెలుగులో గొప్ప సక్సెస్ ఉన్న హీరో. వరుస సినిమా విజయాలతో అటు అభిమానులును ఇటు నిర్మాతలను ఆనందపరుస్తున్నాడు. నేను లోకల్, నిన్ను కోరి సినిమాల​ విజయాలు తరువాత MCA సినిమా షూటింగ్ తో బిజీ అయ్యాడు నాని. ఈ సినిమాలో నానికి జంటగా ఫిదా ఫేమ్ సాయి పల్లవి నటిస్తుంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న మిడిల్ క్లాస్ అబ్బాయి(MCA) ఈ ఏడాది చివరి మాసంలో.. డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫామ్ చేశారు.

ఇకపోతే మరో సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’వచ్చే ఏడాది మొదటి రెండు మూడు నెలల్లో విడుదల కావచ్చు అని తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా మరో మెగా మూవీ కి ఓకే చెప్పాడట నేచురల్ స్టార్. ఇండియాలోనే గొప్ప డైరెక్టర్ అయన మణిరత్న తో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. మణిరత్నం ఒక కథ ఇప్పటికే నానికి వినిపించాడని దానికి నాని కూడా ఓకే చెప్పాడని అంటున్నారు సినీ వర్గాలు. నానికి మణిరత్నం​ అంటే ​ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మణిరత్నం ఓకే బంగారం సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ కు డబ్బింగ్ కూడా చెప్పాడు. ఆ సినిమా వేదిక పై నేను ఎప్పటికైనా మణిరత్నం సినిమా హీరో అవ్వాలి అనుకుంటున్నాను అని కూడా చెప్పాడు. మొత్తానికి అప్పుడు హీరో కి మాటలు అరువిస్తే ఇప్పుడు ఏకంగా మణిరత్నం సినిమాలో హీరో అయ్యాడు అనమాట. అసలు నాని ఆశ ఈ ఏడాదే తీరవలిసింది కానీ ఏదో కారణం చేత ఆ ప్రాజెక్టు వర్క్ ఔట్ కాలేదు.

ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ పూర్తి చేసిన వెంటనే మణిరత్నం సినిమా మొదలుపెడతాడట. బహుశా ఈ సినిమా వచ్చే ఏడాది చివరి నెలలో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. మణిరత్నం కూడా ఒక తమిళ్ సినిమాకు ఈ మధ్యనే స్క్రిప్ట్ లాక్ చేశాడు. ఆ తమిళ్ సినిమా పూర్తి చేసిన తరువాత మళ్ళీ చాలా ఏళ్ళు తరువాత ఒక పూర్తి తెలుగు సినిమాను డైరెక్ట్ చేయబోతోన్నట్లే.. ఇన్ కేస్ ఈ సినిమా పట్టాలెక్కితే!!