Begin typing your search above and press return to search.

త్వరగా స్టార్టు చేయండి మణి సార్‌

By:  Tupaki Desk   |   13 Oct 2015 7:30 PM GMT
త్వరగా స్టార్టు చేయండి మణి సార్‌
X
ఓకే బంగారంతో మళ్లీ ఫాంలోకి వచ్చేశారు దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం. దీనికి ముందు దశాబ్ద కాలంగా బ్యాడ్ టైం ఎదుర్కున్న ఆయన.. లేటెస్ట్ డైరెక్టర్లతో పోటీ పడుతూ తీసిన యూత్ ఎంటర్ టెయినర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇది జరిగి ఆరు నెలలు గడిచిపోయినా ఇప్పటివరకూ తర్వాతి ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయారు మణి రత్నం. స్టోరీ ఫైనల్ కాకపోతే దారి వేరు.. కానీ ఇప్పటికే కథ, కాస్టింగ్ కూడా ఫైనల్ అయిపోయాక అవాంతరాలు ఎదురవడం ఆశ్చర్యకరమైన విషయం.

అనుకోని అడ్డంకుల కారణంగా ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది. మణి రత్నం కొత్త ప్రాజెక్ట్ లోంచి ఇప్పటికే హీరో పాత్రధారి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్ కుడా హ్యాండిచ్చేసింది. మణిరత్నం లాంటి డైరెక్టర్ మూవీలోంచి ప్రధాన పాత్రధారులు తప్పుకోవడమంటే మామూలు విషయం కాదు. అసలు ఆయన డైరెక్షన్ లో చిన్న రోల్ చేయడానికైనా రెడీ అనే స్టార్లు బోలెడు మంది ఉన్నారు. అయితే.. మణిరత్నం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే.. అది తెరకెక్కడానికి టైం పడుతుంది. దుల్కర్ సల్మాన్ - కీర్తి సురేష్ లు గతంలోనే ఓకే చెప్పేసినా.. ఇప్పటికీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. వీళ్లు ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులు కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి తలెత్తింది. అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో.. ఇద్దరూ మణిసార్ కే హ్యాండ్ ఇచ్చారు.

మరోవైపు ఈయనపై ఇప్పుడు నమ్మకం కూడా పూర్తి స్థాయిలో పెట్టుకునే పరిస్థితి లేదు. అయితే.. ఇలా ముందుగా అనుకున్న ప్రధాన పాత్రధారులు తప్పుకున్నా.. అయితే సయామీ ఖేర్ హీరోయిన్‌ పాత్ర చేయడానికి వచ్చింది. మరో జంటగా మన న్యాచురల్ స్టార్ నాని - నిత్యామీనన్ నటిస్తున్నారు. మణిసార్.. ఇప్పటికైనా స్టార్ట్ చేసేయండి.. మళ్లీ డిలే అయితే.. వీళ్లు వెళ్లిపోతారని కాదు కానీ... ఇతర ప్రాజెక్ట్ లు డిస్టర్బ్ అవుతాయి. మీ పర్ఫెక్షనిజం కోసం.. పక్కనోళ్లని ఏడిపించడం కరెక్ట్ కాదు కదా.