Begin typing your search above and press return to search.

చెలియా సెన్సార్ హోగయా!!

By:  Tupaki Desk   |   25 March 2017 7:07 AM GMT
చెలియా సెన్సార్ హోగయా!!
X
దిగ్గజ దర్శకుడు మణి రత్నం రూపొందించిన లేటెస్ట్ ప్రేమ కథా కావ్యం చెలియా. కార్తి- అదితి రావు హైదరి జంటగా నటించిన ఈ చిత్రం.. తెలుగు తమిళ భాషల్లో రూపొందింది. రెండు భాషల్లోనూ ఏకకాలంలో విడుదల కానుండగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ కు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసేశారు.

తాజాగా చెలియా చిత్రాన్ని తిలకించిన సెన్సార్ సభ్యులు.. క్లీన్ యూ సర్టిఫికేట్ ను నిర్మాతల చేతిలో పెట్టేశారు. మొత్తం చిత్ర నిడివి 2 గంటల 27 నిమిషాలు కాగా.. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగిన కథనం ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. చెలియా మూవీలో ఓ ఫైటర్ జెట్ కు పైలట్ గా కార్తి నటించాడు. డాక్టర్ రోల్ లో హీరోయిన్ అదితి కనిపించనుంది. ఎయిర్ ఫోర్స్ అఫీసర్ పాత్రలో కార్తి నటన.. వైద్యురాలిగా అదితి.. వీరిద్దరి మధ్యా సాగే ప్రణయం.. మూవీలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

తమిళ్ కాట్రు వెలియిదాయ్ అనే పేరుతో రూపొందగా.. తెలుగు వెర్షన్ చెలియాకు దిల్ రాజు నిర్మాత. ఏప్రిల్ 7న గ్రాండ్ లెవెల్ లో ఈ మూవీ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నద్ధం అవుతున్నారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి కావడంతో.. ఇక చెలియా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు లేనట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/