Begin typing your search above and press return to search.

మణిరత్నం అంటేనే అద్భుతమన్న డయానా

By:  Tupaki Desk   |   20 Jun 2018 5:49 AM GMT
మణిరత్నం అంటేనే అద్భుతమన్న డయానా
X
మణిరత్నంతో సినిమా అంటే.. ఏ హీరోయిన్ కు అయినా ఓ వరం లభించడమే. సినిమాలు అటూ ఇటూ అయినా.. మణిసార్ సినిమాలో హీరోయిన్ అనే గుర్తింపు.. చాలానే ఖ్యాతిని అందిస్తుంది. పైగా ఓ అమ్మాయి తన తొలి సినిమాకే ఈయన మూవీలో ఛాన్స్ సంపాదిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో.. ఇప్పుడు డయానా ఎరప్పను చూస్తే అర్ధం అవుతుంది.

మోడలింగ్ లో బోలెడంత అనుభవం ఉన్న ఈ భామ.. మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. అరవింద్ స్వామి.. శింబు.. విజయ్ సేతుపతి.. అరుణ్ విజయ్.. ఇలాంటి స్టార్ కాస్ట్ తో మణిరత్నం రూపొందిస్తున్న సినిమాలో.. డయానాకు చోటు దక్కింది. ఓ మూడు నెలలుగా షూటింగ్ కూడా మంచి స్పీడుగానే జరుగుతోంది. మోడలింగ్ లోను ఫ్యాషన్ వరల్డ్ లోను ఎంతటి అనుభవం ఉన్నా.. సినిమా కోసం కెమేరా ముందుకు వచ్చినపుడు.. నోరు పెగల్లేదట. ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా గుర్తుకు రాలేదట.

ఆ సమయంలో మణిరత్నం బోలెడంత సాయం చేశారని అంటోంది డయానా. ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి అన్న ఈ భామ.. నటుల నుంచి తనకు ఏం కావాలో అది తీసుకోవడంలో టాస్క్ మాస్టర్ అంటోంది. ఈ సినిమాలో తన పాత్ర తన రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండడంతో.. మెల్లగా క్యారెక్టర్ కు కనెక్ట్ అయిపోయానని చెబుతోంది. ఇక షూటింగ్ సమయంలో తాను డైలాగ్స్ మర్చిపోతే.. శింబు లాంటి స్టార్ హీరో డైలాగ్స్ అందిస్తూ హెల్ప్ చేయడం అస్సలు మరిచిపోలేనని చెబుతోంది డయానా ఎరప్ప.