ఆ తెలుగు స్టార్ ఎవరు మణి సారూ?

Sun Jan 20 2019 19:07:37 GMT+0530 (IST)

'నవాబ్' తర్వాత మణిరత్నం ఒక భారీ ప్రాజెక్ట్ టేకప్ చేసిన సంగతి తెలిసిందే.  తమిళ క్లాసిక్ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అనే ప్రచారం సాగుతోంది.  రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.  తమిళ.. తెలుగు.. హిందీ భాషలలో ఈ సినిమాను విడుదల చేస్తారు.ఈ సినిమాలో ఇప్పటికే విక్రమ్ ను ప్రధాన పాత్రకు తీసుకున్నారట. తమిళ స్టార్ విజయ్.. మరో హీరో శింబు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటిస్తారట. అమితాబ్ బచ్చన్.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.   స్టార్ కాస్ట్ ఇంతటితో ఆగడం లేదు.  మణి సార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి ఒక స్టార్ హీరోను కూడా ఈ సినిమాలో నటింపజేయాలని అనుకుంటున్నారట.   

న్యాచురల్ స్టార్ నాని లేదా రౌడీ స్టార్ విజయ దేవరకొండ ఇద్దరిలో ఒకరిని తీసుకుంటే తెలుగు మార్కెట్ కూడా వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారట.  నాని మొదటి నుంచి మణి రత్నం అభిమాని.  అయన సినిమాలో చేసేందుకు గతంలో ఇంట్రెస్ట్ చూపించాడు. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని కూడా గతంలో వార్తలు వచ్చాయిగానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. ఈ సినిమాలో చిన్న పాత్ర చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడా అనేది వేచి చూడాలి.  మరోవైపు విజయ్ దేవరకొండకు కూడా చాలా ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అయినా మణి సార్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటాడా అనేది ఇప్పుడే చెప్పలేం. నాని.. విజయ్ ఇద్దరిలో ఎవరు ఈ సినిమాకు వోటేస్తారనేది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాలి.