సాహో తర్వాత ఆ సినిమాలో నటిస్తోంది!

Thu Mar 14 2019 22:06:53 GMT+0530 (IST)

పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రొమాంటిక్'.  పూరి జగన్ ఈ చిత్రానికి కథ.. స్క్రీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాతో అనిల్ పాడూరి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.బాలీవుడ్ నటి మందిరా బేడి ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోందట.  రీసెంట్ గా 'రొమాంటిక్' టీమ్ తో గోవాలో జాయిన్ అయిందని సమాచారం.. ఈ సినిమాలో మందిర నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందట.  టీవీ సీరియల్ నటిగా పాపులారిటీ తెచ్చుకున్న మందిర బాలీవుడ్ సినిమాలలో నటించడంతో పాటుగా టీవీ హోస్టుగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.  ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' లో కూడా నటిస్తోంది మందిర.  ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

'రొమాంటిక్' లో హీరోయిన్ గా దిల్లీ మోడల్ కేతిక శర్మను ఎంపిక చేశారు. ఈ సినిమాతో కేతిక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.  ఆకాష్ పూరి లాస్ట్ సినిమా 'మెహబూబా' లో తన నటనకుగానూ మంచి మార్కులే తెచ్చుకున్నాడు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం లభించలేదు.  మరి యూత్ ఫుల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అయినా ఆకాష్ పూరికి బ్రేక్ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.