Begin typing your search above and press return to search.

మందార మందార.. వాటే స్వీట్ విజువల్

By:  Tupaki Desk   |   20 Jan 2018 5:04 PM GMT
మందార మందార.. వాటే స్వీట్ విజువల్
X
టాలీవుడ్ లో ప్రస్తుతం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం భాగమతి. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు ప్రేక్షుకులను నిరపరిచాయి. అనుకున్నంతగా మెప్పించలేకపోయాయి. దీంతో తప్పకుండా ఈ సినిమాపై కొన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మంచి ఓపెనింగ్స్ కూడా అందుతాయని సినీ ప్రముఖులు చెబుతున్నారు. అయితే చిత్ర యూనిట్ కూడా సినిమా పై హైప్ ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్స్ చేస్తోంది.

రీసెంట్ గా సినిమాకు సంబందించిన ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ సృష్టిస్తోంది. ఇప్పుడు మందార మందార అనే వీడియో సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. థ్రిల్లర్ సినిమాలో థమన్ అందించిన ఈ స్వీట్ మెలోడీ సాంగ్ చాలా బావుంది అని చెప్పడం చిన్న మాటే అవుతుంది. పాటలో అనుష్క ఉన్ని ముకుందన్ కెమిస్ట్రీ చాలా బావుంది. తెరకెక్కించిన విధానం అన్నటికంటే గొప్పగా ఉంది.

అంతే కాకుండా శ్రేయా ఘోషల్ గానం కూడా విజువక్ కి తగ్గటుగా ఉండడంతో పాటలు ఇందులో బోర్ కొట్టవని అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాను పిల్ల జమిందార్ దర్శకుడు జి.అశోక్ తెరకెక్కించగా యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే గ్రాఫిక్స్ సినిమా స్థాయిని పెంచుతాయని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఫైనల్ గా సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది.