Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న టైటిల్ మంచు విష్ణు చేతిలో..!

By:  Tupaki Desk   |   29 Nov 2015 7:49 AM GMT
జ‌క్క‌న్న టైటిల్ మంచు విష్ణు చేతిలో..!
X
బాహుబ‌లి సీక్వెల్ సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి వెయ్యి కోట్ల‌తో ఓ సినిమాని చేయ‌బోతున్నాడ‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌ఖ్యాతిగాంచిన ఓ క‌న్న‌డ న‌వ‌ల ఆధారంగా ఆ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని, అందులో బాలీవుడ్ మొద‌లుకొని టాలీవుడ్ వ‌ర‌కు ప‌లువురు అగ్ర తార‌లు న‌టించ‌బోతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు చెప్పుకొంటున్నారు. ఆ సినిమాకి `గ‌రుడ‌` అన్న టైటిల్‌ ని కూడా ఫిక్స్ చేసి ప్ర‌చారం చేస్తున్నారు. అయితే దానిగురించి జ‌క్క‌న్నకానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యులు కానీ ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. ఆ విష‌యాన్ని అటుంచితే ఇప్పుడు `గ‌రుడ‌` అన్న టైటిల్‌ ని మంచు విష్ణు ఫిల్మ్ ఛాంబ‌ర్‌ లో రిజిస్ట‌ర్ చేయించాడు. ఆ విష‌యం ఇండ‌స్ట్రీలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. జ‌క్క‌న్న తీయాల‌నుకొంటున్న ఆ సినిమా నిర్మాణంలో మంచు విష్ణు కూడా భాగం కాబోతున్నాడా? లేక గ‌రుడ పేరుతో మంచు విష్ణు వేరొక ద‌ర్శ‌కుడితో సినిమా ఏదైనా చేస్తున్నాడా? అన్న సందేహాల‌తో చ‌ర్చ‌లు మొద‌లయ్యాయి.

నిజానికి సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ సైట్ల‌లో త‌న గురించి కానీ, త‌న సినిమాల గురించి కానీ ఎలాంటి ప్ర‌చారం జ‌రిగినా త‌ప్ప‌కుండా స్పందిస్తుంటాడు రాజ‌మౌళి. కానీ గ‌రుడ గురించి మాత్రం స్పందించ‌లేదు. దీన్నిబ‌ట్టి ఈ సినిమాకి సంబంధించి జ‌రుగుతున్న ప్ర‌చారం ఇంకా జ‌క్క‌న్న వ‌ర‌కు వెళ్ల‌లేన‌ట్టుంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు జ‌క్క‌న్న‌కి గ‌రుడ పేరుతో సినిమా తీసే ఆలోచ‌నేదీ లేద‌ని తెలిసింది. బాహుబ‌లి 2తో పాటు, బాహుబ‌లి 3 కూడా తీయ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్త‌య్యేస‌రికి ఇంకో ఐదారేళ్లు ప‌ట్టొచ్చు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి క‌ల‌ల చిత్రం మ‌హాభార‌తం మొద‌లైనా అవ్వొచ్చు. అలాంట‌ప్పుడు గరుడ‌కి చోటెక్క‌డిదంటున్నారు సినీ జ‌నాలు.