Begin typing your search above and press return to search.

విష్ణుకు ల‌క్‌.. నానికి చెక్‌

By:  Tupaki Desk   |   24 Jan 2017 2:00 PM GMT
విష్ణుకు ల‌క్‌.. నానికి చెక్‌
X
సూర్య సినిమా ‘ఎస్‌-3’ వాయిదా ప‌డ్డ ప్ర‌తిసారీ పెద్ద గంద‌ర‌గోళం త‌ప్ప‌ట్లేదు. వేరే సినిమాల రిలీజ్ డేట్లు ఇటు అటు అవుతున్నాయి. డిసెంబ‌రు 16 నుంచి 23కు వాయిదా వేసిన‌పుడు.. ఆ త‌ర్వాత 23 నుంచి కూడా పోస్ట్ పోన్ చేసిన‌పుడు పెద్ద గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇప్పుడు జ‌న‌వ‌రి 26 నుంచి వాయిదా వేయ‌డంతోనూ రిలీజ్ డేట్లు అటు ఇటు అయ్యాయి. ఆ సినిమా వాయిదా వార్త బ‌య‌టికి వ‌చ్చిన కొన్ని గంట‌ల్లోనే మంచు విష్ణు సినిమా ‘ల‌క్కున్నోడు’ ఫిబ్ర‌వ‌రి 3 నుంచి వెన‌క్కి వ‌చ్చి 26కు ఫిక్స‌యింది.

‘ల‌క్కున్నోడు’ 3నే రావాల్సి వ‌స్తే నాని సినిమా ‘నేను లోక‌ల్‌’తో పోటీ ప‌డాల్సి వ‌చ్చేది. అది క‌చ్చితంగా ఇబ్బందే. పైగా ముందు వారం ‘ఎస్‌-3’.. త‌ర్వాతి వారం ‘ఓం న‌మో వెంక‌టేశాయ‌’ పోటీని కూడా త‌ట్టుకోవాల్సి వ‌చ్చేది. ఇప్పుడు సంక్రాంతి సినిమాల జోరు త‌గ్గిపోతున్న టైంలో సోలోగా సినిమాను రిలీజ్ చేసుకునే ఛాన్స్ ద‌క్కింది. ఇప్పుడు త‌ల‌నొప్పి నాని సినిమాకే. 26 నుంచి వాయిదా ప‌డిన ‘ఎస్‌-3’ని ఫిబ్ర‌వ‌రి 3నే రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌య్యారు. ఇది నాని సినిమాకు క‌చ్చితంగా త‌ల‌నొప్పి తెచ్చిపెట్టేదే. మామూలుగా అయితే నేను లోక‌ల్ బాక్సాఫీస్ లీడ‌ర్ అయ్యేది. కానీ సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగేంటో తెలిసిందే కాబ‌ట్టి గ‌ట్టి పోటీ త‌ప్ప‌దు. పైగా వారం తిరిగేస‌రికి ‘ఓం న‌మో వెంక‌టేశాయ’ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో నాని మూవీ ఈ పోటీని త‌ట్టుకుని ఎలాంటి వ‌సూళ్లు రాబ‌డుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/