Begin typing your search above and press return to search.

జనం చూస్తున్నారని రుద్దితే కుదరదు

By:  Tupaki Desk   |   3 Sep 2015 7:04 AM GMT
జనం చూస్తున్నారని రుద్దితే కుదరదు
X
మంచు విష్ణు డైనమైట్ రిలీజ్ కి రెడీ అయింది. ఢీ సినిమా నుంచి తన సినిమాలకు డీ అక్షరంతో మొదలయ్యేలా పేర్లు పెట్టాడు విష్ణు. అయితే... తనకు అలాంటి సెంటిమెంట్ లేదని.. స్క్రిప్ట్ పరంగా అలా కుదిరిందంతే అంటున్నాడు మంచు వారసుడు. హీరో కేరక్టరైజేషన్, స్క్రీన్ ప్లే విపరీతంగా నచ్చడంతోనే తమిళచిత్రం అరిమనంబిని రీమేక్ చేశామని... కానీ ప్లాట్ ఒక్కటే తీసుకుని, కొత్తగా స్టోరీ సిద్ధం చేసుకున్నామని చెబ్తున్నాడు విష్ణు.

వినోదం అన్ని సినిమాల్లోనూ ఉండాలని.. అయితే జనాలు చూస్తున్నారు కదా అని అలాంటివే రుద్దకూడదని చెబ్తున్న విష్ణు... కొత్తగా ఏదైనా ఇచ్చేందుకు ప్రయత్నించాలంటున్నాడు. డైనమైట్ జనాలకు అలాంటి థ్రిల్ ఇస్తుందని నమ్మకంగా చెబ్తున్నాడు. హీరో ఆటిట్యూట్ చెప్పడానికి గెడ్డం, టాటూలతో దర్శనమిచ్చానంటున్నాడు విష్ణు.

ఎక్కువ బడ్జెట్‌ తో సినిమాలు తీసినా... నిర్మాతగా ఎప్పుడూ ఫెయిల్యూర్ కాలేదంటున్నాడు మంచువారబ్బాయి. పాండవులు పాండవులు తుమ్మెద కోసం 28కోట్లు ఖర్చుపెట్టినా.. అంతా కథ ప్రకారమే చేశానని చెబ్తున్నాడు. అనుక్షణం చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్ తో తీశానంటున్నాడు. ఏ సినిమాకి ఎంత ఖర్చు చేయాలో... అంతా స్టోరీయే డిసైడ్ చేయాలంటున్నాడు మంచు విష్ణు. అలా కథను బట్టి కాకుండా... బడ్జెట్ ని, మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాల్సొస్తే... అసలు తీయడమే మానేస్తానంటున్నాడు విష్ణు. మనోడిని తండ్రి మోహన్ బాబు మంచి బిజినెస్ మేన్ అనేది ఇందుకే అనుకుంటా.