గాయాల నుంచి కోలుకున్న హీరో

Wed Sep 13 2017 23:07:16 GMT+0530 (IST)

టాలీవుడ్ లో  తనదైన శైలి సినిమాలు చేసి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. అయితే గత నెలలో సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురైన ఈ హీరో త్వరగానే కొలుకున్నాడు.జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆచారి అమెరికా యాత్ర" అనే సినిమాను షూటింగ్ కొన్ని నెలల క్రితం విదేశాల్లో స్టార్ట్ అయ్యింది.  మలేషియా లో జరిపిన కొన్ని యాక్షన్ సీన్స్ లో భాగంగా హీరో విష్ణు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ని బైక్ పై వేగంగా తీసుకెళ్లాడు. కానీ బైక్ అదుపుతప్పి స్కిడ్ అవ్వడంతో ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు. ప్రగ్యా చిన్న చిన్న గాయాలతో బయటపడగా హీరో విష్ణు మాత్రం కొంచెం తీవ్రంగానే గాయపడ్డాడు. దీంతో మలేషియా షెడ్యూల్ ను చిత్ర యూనిట్ క్యాన్సిల్ చేసింది. అన్ని దెబ్బలు తగిలినా విష్ణు తొందరగానే కొలుకున్నాడని త్వరలోనే చిత్ర షూటింగ్ ను కంటిన్యూ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.

పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కబోయే ఈ సినిమాలో బ్రహ్మానందం - మంచు విష్ణు పాత్రలు హైలెట్ కానున్నాయి. కథానాయిక ప్రగ్యా జైస్వాల్ పాత్ర కూడా ఈ సినిమాలో అందరిని ఆకట్టుకుంటుందట. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో  విష్ణు ఇంతకముందు దేనికైనా రెడీ అనే సినిమాను తీసి మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే తరహల్ పూర్తి కామెడీ చిత్రంగా ఆచారి అమెరికా యాత్ర అనే సినిమా ద్వారా రాబోతున్నాడు.