Begin typing your search above and press return to search.

చొక్కా కూడా విప్పేశాడ‌ట‌!

By:  Tupaki Desk   |   3 Sep 2015 12:01 PM GMT
చొక్కా కూడా విప్పేశాడ‌ట‌!
X
పెండింగ్‌ లో ఉన్న కోరిక‌ల‌న్నీ 'డైన‌మైట్‌' తో తీర్చేసుకొన్న‌ట్టున్నాడు మంచు విష్ణు. మొన్న‌టిదాకా ఆయ‌న గెడ్డం తో క‌నిపించాడ‌నీ, ప‌చ్చ‌బొట్టు వేసుకొన్నాడ‌ని మాట్లాడుకొన్నాం. కానీ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌రకొస్తున్న‌కొద్దీ ఇంకా కొత్త కొత్త విష‌యాలు తెలిసిపోతున్నాయి. సినిమాకోసం త‌న బాడీని భారీగా బిల్డ‌ప్ చేసిన విష్ణు తెర‌ పై చొక్కా విప్పి క‌నిపించ‌బోతున్నాడు. ఇక ఇంత‌గా కండ‌లు పెంచేశాక ఖాళీ గా ఉండ‌టం దేనికి అనుకొన్నాడో ఏమో మ‌రి! తెర‌ పై కండ‌లన్నీ చూపెట్టే ప్ర‌య‌త్నం చేశాడ‌ట‌. ఓ స‌న్నివేశం లో బేర్ బాడీ తో త‌ళుక్కున మెరిశాడ‌ని స‌మాచారం. ఆ విష‌యాన్ని ఇన్నాళ్లూ ఎందుకు చెప్ప‌ లేదంటే... బేర్ బాడీ అంటే మ‌ళ్లీ జ‌నాలు ఏదేదో ఊహించుకొని వ‌స్తార‌ని, అలా ఊహించు కోకూడ‌ద‌నే చెప్ప‌లేద‌ని విష్ణు స‌మాధాన‌మిస్తున్నాడు.

యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రం పై విష్ణు చాల ఆశ‌లు పెట్టుకొన్నాడు. దేవాక‌ట్టాలాంటి మంచి ద‌ర్శ‌కుడు దొర‌క‌డం, 'ఆరిమ నంబి'లాంటి ప్రూవ్డ్ సబ్జెక్ట్ కావ‌డంతో విష్ణు భారీగా ఖ‌ర్చు పెట్టి సినిమాని చేశాడు. త‌న‌వంతుగా కూడా ఏమేం చేయాల‌నుకొన్నాడో అదంతా చేశాడు. ఇక ఫ‌లితం గురించి ఇప్పుడు ఆస‌క్తి గా ఎదురు చూస్తున్నాడు. సినిమా పై కాన్ఫిడెన్స్‌ తో ఆయ‌న ముంద‌స్తు గానే ప్రివ్యూ ఏర్పాటు చేశాడు. ఇటీవ‌ల‌ కాలంలో పెద్ద సినిమాల్ని ప్రివ్యూలు గా వేయ‌డం అరుదు. ఏమాత్రం ఆక‌ట్టుకొనేలా లేక‌పోయినా బ్యాడ్ రివ్యూలు వ‌చ్చేస్తాయి. అందుకే ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే త‌ప్ప ప్రివ్యూ వేయ‌రు. విష్ణు మాత్రం వంద‌శాతం న‌మ్మ‌కం తో క‌నిపిస్తున్నాడు. ఇందులో ఆయ‌న స‌ర‌స‌న ప్ర‌ణీత న‌టించింది. రేపే సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది.