Begin typing your search above and press return to search.

విష్ణు @ యాక్షన్ హీరో

By:  Tupaki Desk   |   2 Sep 2015 7:44 AM GMT
విష్ణు @ యాక్షన్ హీరో
X
మంచు విష్ణుకి తొలి నుండీ యాక్షన్ హీరోగా నిలదొక్కుకోవాలని వుండేది. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు చేసినా అవేవీ విష్ణు ముచ్చట తీర్చలేదు. యాక్షన్ కి కామెడీ మిక్స్ చేసిన ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలు హిట్ అయ్యి అన్ని రకాలుగానూ సంతృప్తినిచ్చాయి. అప్పట్లో కాస్త బొద్దుగా ఉండేవాడు గనుక యాక్సన్ సీన్స్ కాస్త ఎబ్బెట్టుగా ఉండేవేమో గానీ సన్నబడ్డాక బానే వున్నాడు. రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని రౌడీ సినిమాలో అదరగొట్టాడు.

ప్రస్తుతం డైనమైట్ సినిమా కూడా యాక్షన్ ఇమేజ్ కోసమే చేసినట్టు తెలుస్తోంది. యాక్షన్ పండాలంటే కథలో బలం వుండాలి. అందుకే అరిమానంబి కథను తీసుకున్నారట. ఇకపోతే డైనమైట్ మాతృక కంటే బాగా వచ్చిందిట. ఆ క్రెడిట్ అంతా దేవాకట్టదే అని అంటున్నాడు విష్ణు. బివిఎస్ రవి రాసిన కొన్ని మాటలు, విజయన్ మాస్టర్ ఫైట్ సీన్స్ స్పెషల్ గా నిలుస్తాయని, డైనమైట్ సినిమాతో యాక్షన్ హీరో ఇమేజ్ వస్తుందని నమ్మకంతో వున్నాడు. ఆటోనగర్ సూర్య సినిమాలో ఇంటెన్సిటీ నచ్చి దేవాకట్ట అయితేనే ఈ సినిమాకి కరెక్ట్ అని ఆయన చేతిలో ఈ సినిమాని పెట్టాడట.

తర్వాతి సినిమాలు ఆ ఇమేజ్ ని కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. అడ్డా సినిమా దర్శకుడు సాయి కార్తీక్ తో ఓ సినిమా చేస్తున్నాడు. సాయి కార్తీక్ కూడా రెండో సినిమా యాక్షన్ ప్యాకేజ్ తో చేస్తున్నట్టు గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. నిర్మాతగానూ తన సొంత బ్యానర్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లో వచ్చే ఏడాది వేరే హీరోలతో 5 సినిమాలు, తాను హీరోగా 2 సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నాడట ఈ మంచు వారి అబ్బాయి. విష్ణు యాక్షన్ కల నెరవేరాలని ఆశిద్దాం.