Begin typing your search above and press return to search.

మాంచి స్పీడ్‌ మీద మంచు విష్ణు

By:  Tupaki Desk   |   6 Oct 2015 7:30 PM GMT
మాంచి స్పీడ్‌ మీద మంచు విష్ణు
X
దేవ్ కట్టా లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ని పెట్టి.. తమిళ్ సూపర్ హిట్ అయిన స్టోరీని తెచ్చి.. డైనమైట్ అంటూ భారీగా ఖర్చు చేసి మూవీ తీసినా మంచు విష్ణుకు ఆశించిన హిట్ దక్కలేదు. సాధారణంగా ఇంతటి ఫ్లాప్ వస్తే.. ఇండస్ట్రీలో కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది. కానీ తన మిస్టేక్స్ ని తొందరగానే తెలుసుకున్న విష్ణు.. నెక్ట్స్ వెంచర్ ని జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసేస్తున్నాడు.

తనకు బాగా అచ్చొచ్చిన లవ్ అండ్ ఎంటర్ టెయిన్ మెంట్ జోనర్ లో తీస్తున్న మూవీకి.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అడ్డా సినిమా తీసిన కార్తిక్ రెడ్డి డైరెక్షన్ లో జాదూగాడు ఫేం సోనారిక హీరోయిన్ గా నిటిస్తోంది. విష్ణు బాడీ లాంగ్వేజ్ కి తగినట్లుగా కేరక్టర్ ఉంటుందని.. ఆద్యంతం ఆసక్తికరమైన స్టోరీ, పట్టువదలని స్క్రీన్ ప్లే.. ఆకట్టుకుంటాయంటున్నాడు డైరెక్టర్. ఇప్పటికే పూర్తైన ఫస్ట్ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని.. ప్రొడ్యూసర్ సోమా విజయ ప్రకాష్ చెబ్తున్నాడు.

రెండో షెడ్యూల్ ను కూడా హైద్రాబాద్ లోనే చేస్తామని.. దీనిలో కామెడీ, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరపుతామని యూనిట్ వర్గాలు తెలిపాయి. దసరా రోజున... మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తామని.. ఈ సినిమా పేరు విభిన్నంగా ఆకట్టుకునేలా ఉంటుందని అంటోంది యూనిట్. ఈ మూవీ ద్వారా ప్రేమలో కొత్త యాంగిల్ చూపించబోతున్నాడట మంచు విష్ణు