Begin typing your search above and press return to search.

మంచు విష్ణు.. ఇంకో స్కూల్‌ పెట్టాడు

By:  Tupaki Desk   |   30 May 2016 7:11 AM GMT
మంచు విష్ణు.. ఇంకో స్కూల్‌ పెట్టాడు
X
ఈరోజు పేపర్లలో ఫుల్ పేజీ యాడ్ చూసినవారందరికీ ఒకటే షాక్‌. ఈ కొత్త స్కూల్‌ కు మంచు విష్ణు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా చేస్తున్నాడా లేకపోతే స్కూలంతా ఇతనిదేనా అని. నిజానికి ఆ స్కూల్‌ మంచు విష్ణుదే. అతని భార్య విరానికా ఈ స్కూల్‌ ను నడుపుతున్నట్లు తెలుస్తోంది.

''న్యూయార్క్ అకాడమీ''. ఇప్పుడు హైదరాబాద్‌ లో కూడా వచ్చేసింది. శ్రీవిద్యా నికేతన్ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ స్కూల్‌ ను రన్ చేస్తున్నారు. అయితే ఈ స్కూల్‌ ను ఇండియాలో ప్రారంభించాలి అనే ఐడియా మాత్రం విరానికా దే అని తెలుస్తోంది. ఇంటర్నేషనల్‌ కరికులమ్‌ అండ్‌ వెరైటీ మెథడ్స్ ఆఫ్‌ టీచింగ్‌ తో ఈ స్కూల్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎడ్యుకేషన్‌ అందిస్తారట. ఇప్పటికే తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ అనే స్కల్‌ కమ్ కాలేజ్‌ ను నడుపుతున్న మంచు ఫ్యామిలీ.. ఇప్పుడు మరో ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ స్కూల్‌ ను ఇండియా తీసుకురావడం.. పెద్ద విషయమే.

ఇకపోతే ఆల్రెడీ హైదరాబాద్ లో పెట్టిన ఇంటర్నేషనల్‌ స్కూల్స్ కు మరి ఈ అమెరికన్‌ మోడల్‌ స్కూల్‌ గట్టి పోటీనే ఇస్తుందేమో చూడాలి.