Begin typing your search above and press return to search.

ఓ మంచి సబ్జెక్టుతో మెప్పించాడు

By:  Tupaki Desk   |   5 Sep 2015 1:25 PM GMT
ఓ మంచి సబ్జెక్టుతో మెప్పించాడు
X
గత ఏడాది వరకు యమ స్పీడు మీదున్న మంచు విష్ణు.. ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. డైనమైట్ సినిమా చేస్తుండగా వేరే సినిమా ఏదీ ఒప్పుకోకుండా దాని మీదే దృష్టిపెట్టాడు. ఆ సినిమా ఈ శుక్రవారం విడుదలై పర్వాలేదనిపించే టాక్ తో నడుస్తోంది. ఇప్పుడిక తర్వాతి ప్రాజెక్టులపై విష్ణు దృష్టి పెట్టాడు. దాదాపు నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో భక్త కన్నప్ప మొదలు పెట్టడం ఇప్పట్లో సాధ్యపడే పని కాదు. హనుమంతుడి జీవితం మీద తీయాల్సిన సినిమా కూడా అంతే. ఓ కొత్త దర్శకుడి సినిమాకు కూడా కమిటై ఉన్నాడు. ఐతే అవేవీ కాకుండా యంగ్ డైరెక్టర్ జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఆరంభించబోతున్నాడు విష్ణు.

‘జాదూగాడు’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ సోనారికా బడోరియా ఈ సినిమాలో విష్ణు సరసన నటించబోతోంది. తొలిసారి మంచు సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించబోతున్నాడు. ఈ నెల 10న ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. ఈ సినిమాకు విష్ణు నిర్మాత కాదు. పల్లి కేశవరావు, డి.కుమార్ అనే కొత్త నిర్మాతలు నిర్మించబోతున్నారు. ఓ స్టయిలిష్ యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ ఇదని చెబుతున్నారు. మొన్నటిదాకా విష్ణు ప్రణాళికల్లో ఈ సినిమా లేదు. ఐతే సడెన్ గా ఈ సినిమా ఓకే చేసి.. సెట్స్ మీదికి తీసుకెళ్తున్నాడు. కార్తీక్ రెడ్డి ఇంతకుముందు సుశాంత్ తో ‘అడ్డా’ సినిమా చేశాడు. అది పెద్దగా ఆకట్టుకోనప్పటికీ ఓ మంచి సబ్జెక్టుతో విష్ణును మెప్పించాడు. చాలా షార్ట్ టైంలో సినిమా పూర్తి చేసి.. జనవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు విష్ణు.