Begin typing your search above and press return to search.

హీరోలంతా విష్ణును చూసి నేర్చుకోవాలి

By:  Tupaki Desk   |   28 Aug 2015 5:36 AM GMT
హీరోలంతా విష్ణును చూసి నేర్చుకోవాలి
X
సామాజిక బాధ్యత విషయంలో మన హీరోల్ని తీసిపారేయలేం. వీలున్నప్పుడల్లా తమవంతుగా ముందుకు వస్తూనే ఉన్నారు. మంచి పనులు చేస్తూనే ఉన్నారు. మంచు వారబ్బాయ్‌ విష్ణు ఈ విషయంలో మరి కాస్త అడ్వాన్స్‌ డ్‌. అతడు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఏకంగా 10 గ్రామాల్ని దత్తత తీసుకుని మంచి నీటి సమస్య లేకుండా ఆదుకుంటున్నాడు. అంతేకాదు ఆ గ్రామాల్లో పిల్లల చదువుల విషయమై బాధ్యత తీసుకుంటున్నాడు. స్కూల్‌ లో టాయ్‌ లెట్‌ లు వగైరా లేకపోవడంతో డ్రాపౌట్‌ లు అవుతున్న అమ్మాయిల్ని తిరిగి స్కూళ్లలో చేర్పించేందుకు తనే స్వయంగా టాయ్‌ లెట్లు నిర్మిస్తున్నాడు. ఇలా ఆ గ్రామాలకు సంబంధించిన ప్రతి సమస్యని తనదిగా భావించి పనిచేస్తున్నాడు.

అంతేకాదు.. అతడు ఇటీవలే ముంబై లోని శిరుపూర్‌ మోడల్‌ సిటీని పరిశీలించాడు. అందుకోసం యూనివర్శిటీ నుంచి ప్రొఫెషనల్స్‌ ని తీసుకుని వెళ్లాడు. అక్కడ నీటి సమస్య లేదు. గ్రౌండ్‌ వాటర్‌ కి ఇబ్బంది లేదు. సరిగ్గా సేమ్‌ ప్లాన్‌ ని తను అడాప్ట్‌ చేసుకున్న గ్రామలకు అప్లయ్‌ చేసి నీటి సమస్య లేకుండా చేయాలన్నది ప్లాన్‌. దీనికోసం కేవలం 70 నుంచి 80లక్షలు ఖర్చవుతుంది అంతే. నా గ్రామాల్ని శిర్‌ పూర్‌ మోడల్‌ సిటీలా మార్చేస్తానని, అందుకోసం చంద్రబాబుని కలుస్తానని విష్ణు చెప్పాడు. స్నేహితుడు తపన్‌ పటేల్‌ (ముంబై ఎంపీ ముఖేష్‌ కొడుకు) సాయం తీసుకున్నానని చెప్పాడు.

శభాష్‌! యువహీరోలతో పాటు పరిశ్రమలో ధనవంతులందరూ విష్ణులానే ఆలోచిస్తే ఎన్నో గ్రామాల్లో సమస్యలన్నీ చిటికెలో పరిష్కారం అవుతాయి. కానీ అలా చేసేదెవరు?