Begin typing your search above and press return to search.

మంచు విష్ణు అలా ఫిక్సయ్యాడేంటి?

By:  Tupaki Desk   |   17 March 2018 11:33 AM GMT
మంచు విష్ణు అలా ఫిక్సయ్యాడేంటి?
X
చిన్న-మీడియం రేంజి సినిమాలకు సరైన రిలీజ్ డేట్ దొరకడమే కష్టం. అందులోనూ ఒకసారి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని.. దాన్ని మిస్ చేసుకుంటే విడుదల మరింత కష్టమవుతుంది. మంచు విష్ణు కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ విషయంలో ఇలాగే జరిగింది. జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. థియేటర్లు బుక్ చేశారు. బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్లు వేశారు. ప్రమోషన్లు కూడా చేశారు. కానీ ఏమైందో ఏమో.. విడుదలకు ముందు రోజులుండగా సినిమా వాయిదా అనేశారు. తర్వాత నెలన్నరగా ఈ సినిమా ముచ్చట్లే లేవు.

ఇప్పుడేమో ఏప్రిల్ 5న రిలీజ్ అంటూ ఉన్నట్లుండి డేట్ ఇచ్చారు. కానీ ఆ తేదీకి రిలీజ్ అంటే అంత సులువైన వ్యవహారమేమీ కాదు. మార్చి 30న ‘రంగస్థలం’ భారీ అంచనాలతో వస్తోంది. తర్వాతి వారంలో సినిమా విడుదల చేయడం సాహసమే అవుతుంది. పైగా ఆ తేదీకి ఆల్రెడీ ‘చల్ మోహన రంగ’ కూడా షెడ్యూల్ అయింది. ఆ సినిమాకు క్రేజ్ బాగానే ఉంది. ఆపై నాని చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ రాబోతోంది. వీటితో పోలిస్తే ‘ఆచారి అమెరికా యాత్ర’ రేంజ్.. దానిపై అంచనాలు తక్కువే. మరి ఈ పోటీ మధ్య ఆ సినిమా ఏమాత్రం నిలుస్తుందో.. ఎంత మేర జనాల్ని ఆకర్షిస్తుందో చూడాలి. ఈ చిత్రంపై కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టేశారట నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి. మరి ఆయనకు ‘ఆచారి అమెరికా యాత్ర’ ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో చూడాలి.