ఎన్టీఆర్ కోసం నా ప్రాణాలైనా ఇస్తా - మంచు మనోజ్

Sat Mar 23 2019 23:34:37 GMT+0530 (IST)

మంచు మనోజ్ సడన్‌గా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఫీజు రియింబర్స్మెట్ తాలూకు బిల్లులు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదని నిన్న తిరుపతిలో చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మంచు మనోజ్ కూడా పాల్గొన్నాడు. అయితే దీక్ష గురించి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన మంచు మనోజ్ ట్విట్టర్ సాక్షిగా సమాధానం ఇచ్చాడు. ప్రతీ రూపాయి క్టార్జితం అని.. నిజాలు తెలుసుకుని మాట్లాడలని స్పందించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్లో తన అబిమానులతో ముచ్చటించాడు.ఇక  ట్విట్టర్లో మంచు మనోజ్‌ని అతని అభిమానులు చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడిగారు. అన్నింటికి ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు మనోజ్. పవన్‌కల్యాణ్‌కు మద్దతు ఇస్తావా అని అభిమాని అడిగిన ప్రశ్నకు.. తప్పకుండా ఇస్తాను అని చెప్పాడు. మరో అభిమాని ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు మద్దతు ఇస్తావా అని అడిగాడు. దానికి అదిరిపోయే సమాధానం చెప్పాడు మనోజ్. తారక్ తన ప్రాణం అని.. అతని కోసం తన ప్రాణాల్ని అడ్డుగా పెడతానని చెప్పి అభిమానుల మనసు దోచుకున్నాడు. తారక్ మనోజ్ పుట్టినరోజులు మే 20నే. అదీగాక తారక్‌తో చిన్నప్పుడు మనోజ్ ఆడుకునేవాడు. అప్పటినుంచి ఎన్టీఆర్ అంటే మనోజ్‌కు చాలా ఇష్టం.